Moeen Ali gets fined in ENG vs AUS 1st Test: ఇంగ్లండ్ సీనియర్ స్పిన్నర్ మొయిన్ అలీకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో (Ashes 2023) భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అలీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాదు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ చేర్చింది. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సుదీర్ఘ విరామం తర్వాత అలీ టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 89 ఓవర్‌లో బౌండరీ లైన్ వద్ద మొయిన్ అలీ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో డ్రెయింగ్ ఏజెంట్‌తో అలీ తన బౌలింగ్ చేతిపై స్ప్రే చేయించుకున్నాడు. డ్రైయింగ్ ఏజెంట్‌తో స్ప్రే చేయించుకునే ముందు అంపైర్ల అనుమతి తీసుకోనందున ఐసీసీ అతడిపై చర్యలకు (Moeen Ali Fine) దిగింది. యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందే అంపైర్‌లు ఆటగాళ్లకు కొన్ని నిబంధనలు పెట్టారు. అనుమతి లేకుండా చేతికి ఎటువంటి క్రీమ్‌లు, స్ప్రేలు చేయించుకోకూడదు.
Also Read:
Upcoming SUV Launch 2023: సరికొత్త 3 ఎస్‌యూవీలు వచ్చేస్తున్నాయి.. ఇక హ్యుందాయ్ క్రెటాకు బైబై చెప్పాల్సిందే!
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తెలిపాడు. మొయిన్ అలీ తన చేతులను ఆరబెట్టడానికి మాత్రమే స్ప్రేని ఉపయోగించాడని, బంతి రూపాన్ని మార్చడానికి కృత్రిమ పదార్థంగా దేనిని ఉపయోగించలేదని పేర్కొన్నాడు. అలీ తన నేరాన్ని అంగీకరించాడని, అధికారిక విచారణ అవసరం లేదు అని ఐసీసీ చెప్పింది.
311/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌట్ అయింది. ఆధిక్యం సంపాదిస్తుందనుకున్నా.. ఇంగ్లండ్ స్కోరుకు 7 పరుగుల వెనకంజలో ఉండిపోయింది. ఆసీస్ 75 పరుగుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా (141; 321 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలెక్స్ క్యారీ (66; 99 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌లు)లు కాసేపు పోరాడారు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 12 రన్స్ చేసింది. దాంతో ఆధిక్యం 19 పరుగులుగా ఉంది.
Also Read: Best Fruits For Kidney: రోజూ ఈ పండ్లను తింటే.. కిడ్నీ సంబంధిత వ్యాధులు అస్సలు రావు!