ICC Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. తమ స్థానాలను మెరుగుపర్చుకొని మరీ ముందుకు ఎగబాకారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సీనియర్ బౌలర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆ బౌలర్ మరెవరో కాదు. టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ 864 పాయింట్లతో మొదటి ర్యాంక్‌లో నిలిచాడు. స్వదేశంలో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ-2023లో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అశ్విన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన ఈ వెటరన్ స్పిన్నర్.. ఢిల్లీ టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో రాణిస్తున్న రవీంద్ర జడేజా 763 పాయింట్లతో ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని 8వ స్థానానికి చేరాడు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో తన టాప్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకోవడం గమనార్హం.
Read Also: Health Benefits Of Beer: బీర్ తాగడం వల్ల 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
దాదాపు ఆరు నెలల నుంచి ఆటకు దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి నాలుగు స్థానంలో నిలిచాడు. జేమ్స్ ఆండర్సన్ ఎనిమిది రేటింగ్ పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోగా.. 864 పాయింట్లతో ఉన్న అశ్విన్ నంబర్ వన్‌గా అవతరించాడు. టాప్-5లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్, టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది స్థానం సంపాదించారు. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌తో అదరగొట్టిన ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఆల్‌రౌండర్ల జాబితాలో రెండు ర్యాంక్‌లను మెరుగుపర్చుకుని 8వ స్థానంలో నిలిచాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలోనూ జో రూట్ (871) రెండు ర్యాంక్‌లు ఎగబాకి మరీ మూడో స్థానానికి చేరాడు.