ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకోవాలని టీమ్ ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా రెండో ఏడాది సైతం భారత జట్ట ఫైనల్ కు చేరుకుంది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇండియా ఈసారి ఆస్ట్రేలియాను ఓడించి కప్ దక్కించుకోవాలని చూస్తోంది. జూన్ 7 నుంచి 11 వరకు లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా-భారత్ జట్లు మ్యాచ్ ఆడే జట్లను ప్రకటించాయి. అయితే టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. జట్టును ప్రకటించడానికి కన్నా ముందే జస్ ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయింది. ఇప్పుడు గాయాల జాబితా రోజు రోజుకు పెద్దది అవుతుంది. ఫైనల్ మ్యా్చ్ కోసం జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో నలుగురు గాయాల కారణంగా మ్యాచ్ కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది.
Also Read : Sri Lakshmi Narasimha Swamy Jayanti: శ్రీ నరసింహ స్వామి జయంతి శుభవేళ ఈ అభిషేకం వీక్షిస్తే చాలు..
ఉమేశ్ యాదవ్ 2021లో ఇంగ్లండ్ లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడు.. ఇంగ్లండ్ కండిషన్స్ లో బంతిని వేగంగా వేయడంతో పాటు మంచి స్వింగ్ ను రాబట్టగల బౌలర్లలో ఒకడు. ఐపీఎల్ 2023లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతూ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ కు ముందు గాయపడ్డాడు. ప్రస్తుతం బుమ్రా అందుబాటులో లేకపోవడంతో ఉమేశ్ కీలకం అవుతాడని భావిస్తుండగా అతడు గాయపడడం ఇబ్బంది కలిగిస్తోంది. అయితే ఈ గాయం మరీ అంత తీవ్రమైంది కాకాపోవచ్చునని తెలుస్తుంది. అయినప్పటికీ మ్యాచ్ కు డబ్య్లూటీసీ ఫైనల్ నాటికి కోలుకుంటాడా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది.
Also Read : Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు.. 21 మంది మృతి
ఇంగ్లండ్ పిచ్ లపై కీలకం అవుతాడని భావిస్తున్న మరో ప్లేయర్ శార్థూల్ ఠాకుర్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో రాణించగల ఠాకూర్ తుది జట్టులో ఉండే టీమ్ సమతూకం అవుతుందని అందరు భావించారు. కానీ కోల్ కతాకు ఆడుతూ గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరం అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. బ్యాటింగ్ లో మూడో స్థానంలో బరిలోకి దిగి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే.. కెప్టెన్ నితీశ్ రాణా అతడికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. అతడు బౌలింగ్ ఆల్ రౌండర్ కావడంతో డబ్య్లూటీసీ ఫైనల్ కు ముందు ఇది ఆందోళన కలిగించే అంశం. దీంతో అతడు పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : Russia: జెలెన్ స్కీని చంపడం తప్ప వేరే మార్గం లేదు.. రష్యా తీవ్ర హెచ్చరిక..
అయితే.. చాలా కాలం తరువాత ఇటీవలే టెస్టు జట్టులోకి వచ్చాడు జయదేశ్ ఉనాద్కత్. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతున్నాడు. అయితే ప్రాక్టీస్ చేస్తున్న టైంలో కిందపడిపోయాడు. అతడి భుజానికి గాయమైంది. గాయానికి స్కానింగ్ నిర్వహించిన అనంతరం ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయినట్లు ప్రకటించారు. డబ్య్లూటీసీ ఫైనల్ వరక కోలుకుంటాడా అనేది డౌట్ గా మారింది. కోలుకోకపోతే ఇంగ్లండ్ విమానం ఎక్కే పరిస్థితి కనిపించడం లేదు. మరో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ సైతం గాయపడ్డాడు. ఐపీఎల్ లో లక్నోకు సారథ్యం వహిస్తున్న రాహుల్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా.. అతడి గాయం తీవ్రమైందిగా తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ మొత్తానికి అతడు దూరం అయినట్లు సమాచారం. ప్రస్తుతం లక్నో జట్టుతోనే ఉన్న రాహుల్ గురువారం ముంబైకి వెళ్లనున్నాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో అతడికి స్కానింగ్ పరీక్షలు జరుగనున్నాయి. రాహుల్ చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను బీసీసీఐ పర్యవేక్షిస్తుంది. అతడి గాయం కనుక తగ్గకపోతే డబ్య్లూటీసీ ఫైనల్ ఆడటం కష్టమే. ఒకవేళ వీరందరు కోలుకుని ఇంగ్లండ్ కు వెళ్లినా వంద శాతం ఫిట్ నెస్ సాధించి మ్యాచ్ ఆడతారా లేదా అనేది డౌట్ గా మారింది.
Also Read : Reece Thompson: పాతికేళ్ళుగా ‘టైటానిక్’ బుడ్డోడికి రాయల్టీ!
డబ్య్లూటీసీ ఫైనల్ జట్టు : రోహిత్ శర్మ ( కెప్టెన్ ), శుబ్ మన్ గిల్, చట్టేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ( వికెట్ కీపర్ ), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.