వన్డే వరల్డ్‌కప్ అనేది మెగా టోర్నీ.. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎక్కడ ఆతిథ్యం ఇస్తే అక్కడికి వచ్చి ఆడాల్సిందే.. అంతేకానీ ఒకరి స్వార్థం కోసం వేదికలు మార్చడానికి ఆస్కారం లేదని ఐసీసీ వెల్లడించింది.
ప్రస్తుతం క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్ ల కంటే తీగ్ ల పేరుతో ఆయా దేశాలు నిర్వహిస్తున్న టోర్నీ మ్యాచ్ లు ఎక్కవైపోయాయి. విరివిగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్ ల వల్ల అంతర్జాతీయ క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందని.. దానిని కాపాడుకోవాని క్రికెట్ లో చట్టాలు చేసే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్( ఎంసీసీ) వెల్లడించింది.
BCCI : బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్, మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి.
ICC Rankings: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఓడిపోయింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అసలే వన్డే సిరీస్ ఓడిపోయిన బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అయితే మూడో వన్డేలోనూ భారత్ గెలిస్తే న్యూజిలాండ్ మూడో స్థానానికి పడిపోవడంతో…
ICC: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో అందరూ ఆన్లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. అయితే ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. చాలా మంది సామాన్యులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. విచిత్రం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను నడిపించే ఐసీసీ కూడా సైబర్ నేరగాడి వలలో పడింది. 2.5 మిలియన్ డాలర్లకు పైగా ఐసీసీ మోసపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ కరెన్సీలో 2.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20 కోట్లు. దుబాయ్‌లోని…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
Ben Stokes: ఐసీసీపై ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ రూపకల్పనపై ఐసీసీ తగినంత శ్రద్ధ చూపడం లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ అని.. ఎలాంటి ఉపయోగం లేని సిరీస్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా ఎవరికైనా అర్ధమైందా అంటూ స్టోక్స్ ఆరోపించాడు. దేశవాళీ టీ20లకు ఆదరణ పెరుగుతుండటం టెస్ట్ ఫార్మాట్ అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతుందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.…
World Test Championship: బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఎనిమిది విజయాలు, నాలుగు ఓటములతో 99 పాయింట్లతో 58.93 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు, ఒక ఓటమితో 120 పాయింట్లు సాధించింది.…
2023 అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే ఈ టోర్నీ నిర్వహణపై ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023కి భారత్ ఆతిథ్యమవ్వనున్న నేపథ్యంలో.. వరల్డ్ కప్ భారత్ నుంచి తరలిపోతుందనే వార్త టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది.