World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది.. అహ్మదాబాద్‌లోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Released ODI World Cup 2023 Official Schedule: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ మెగా టోర్నీకి సంబందించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలుకానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత గడ్డపై జరగనున్న విషయం తెలిసిందే.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.
Also Read
- Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
మెగా వెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ప్రపంచకప్ 2023 కోసం ఎనిమిది జట్లు ఇప్పటికే అర్హత సాధించగా.. జూలై 9న ముగిసే క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా మరో రెండు జట్లు అర్హత సాధిస్తాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో ఆడుతుంది. గ్రూప్ స్టేజ్ టాప్ 4లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌లకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్ నవంబర్ 12న కోల్‌కతాలో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
— ICC (@ICC) June 27, 2023
తాజావార్తలు
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!