పట్ట పగలే కత్తులు, బ్యాట్ లతో సినీ నటి రమ్య శ్రీ, ఆమె సోదరుడిపై దాడి చేశారు కొంతమంది దండగులు. ఈ రోజు హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టింది హైడ్రా. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్టు సమాచారం.
హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలుచోట్ల వర్షం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మేఘాలు కమ్ముకున్నాయి. అనేక చోట్ల వాన కురుస్తోంది. దీంతో ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ…
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..! హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా…
పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తొలిసారిగా 600కు 600 మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి…
HYDRAA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) తన గుర్తింపులో ఒక పెద్ద మార్పును ప్రకటించింది. ఇంతకు ముందు ఈవీడీఎం (EVDM) లోగోను వినియోగిస్తున్న హైడ్రా, ఇకపై కొత్త లోగోతో తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ మార్పు సంస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ గుర్తింపు పెంచేలా ఆకర్షణీయంగా రూపుదిద్దబడింది. హైడ్రా యొక్క కొత్త లోగోలో “హెచ్” అక్షరంపై నీటి బొట్టు ఆకృతిని చేర్చారు. ఈ రూపకల్పన నీరు, పరిరక్షణ, , ప్రభుత్వ…
తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, నిన్న హైడ్రా కూల్చివేసిన సర్వే నంబర్‌పై ఎలాంటి కేసు లేదని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 79/1, 79/2 సర్వే నంబర్ రెగ్యులరైజ్ అయ్యిందని.. గతంలో అన్ని సీలింగ్ ల్యాండ్స్ తో పాటు తమది కుడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారన్నారు. అన్ని డాక్యుమెంట్స్ నెల రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి స్వయంగా అందించానని, ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేశారని మండిపడ్డారు. హైడ్రా…
HYDRA : హైదరాబాద్ నగరంలోని చెరువుల సంరక్షణ, అభివృద్ధికి హైడ్రా (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రత్యేక చర్యలు చేపడుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల పలు చెరువులను పరిశీలించి, అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖాజాగూడాలోని కొత్త కుంట చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వంశీరామ్ బిల్డర్స్ ప్రతినిధులతో మాట్లాడి చెరువులో వేసిన మట్టిని…
HYDRA : హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్న.. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని పేర్కొన్న హైకోర్టు హైడ్రా కమిటీ విధానంపై మరోసారి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలకే హైడ్రా లక్ష్యమా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అనే…
HYDRAA: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన స్పష్టమైన ప్రకటన కూడా చేశామని తెలిపారు.