హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలుచోట్ల వర్షం
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మేఘాలు కమ్ముకున్నాయి. అనేక చోట్ల వాన కురుస్తోంది. దీంతో ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కామారెడ్డిలో సైబర్ మోసం.. 5.8 లక్షలు రికవరీ చేసిన పోలీసులు..!
సైబర్ నేరగాళ్ల నుంచి 5.80 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విజయవంతమయ్యారు. ఇటీవల కామారెడ్డికి చెందిన రాజేందర్‌కు ఓ అనామక నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తులు ముంబై పోలీసులమని పరిచయం చేసుకున్నారు. రాజేందర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను తాము చెప్పిన ఖాతాకు వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే అరెస్ట్ అవుతావని హెచ్చరించారు.
డ్రాగన్ భామ పై సంచలన ఆరోపణలు.. లిక్కర్ స్కాం నిందితులతో..?
ప్రజంట్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు కయాదు లోహర్. నాలుగేళ్ల క్రితం చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అనూహ్యంగా రీసెంట్ గా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె గ్లామర్ తో పాటు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అధర్వ, జీవి ప్రకాష్ సినిమాల్లో నటిస్తున్న ఆమె శింబు తో పాటు ఒక సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా వరుస ఆఫర్లతో దూసుకుపోతూ కేవలం రెండు నెలల్లోనే గత నాలుగేళ్లలో చేసిన సినిమాల సంఖ్య బీట్ చేసింది. అలాంటిది ఈ అమ్మడుకి సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..
డ్రాగన్ భామ పై సంచలన ఆరోపణలు.. లిక్కర్ స్కాం నిందితులతో..?
ప్రజంట్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు కయాదు లోహర్. నాలుగేళ్ల క్రితం చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అనూహ్యంగా రీసెంట్ గా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె గ్లామర్ తో పాటు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అధర్వ, జీవి ప్రకాష్ సినిమాల్లో నటిస్తున్న ఆమె శింబు తో పాటు ఒక సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా వరుస ఆఫర్లతో దూసుకుపోతూ కేవలం రెండు నెలల్లోనే గత నాలుగేళ్లలో చేసిన సినిమాల సంఖ్య బీట్ చేసింది. అలాంటిది ఈ అమ్మడుకి సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..
వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం రాజకీయంగా ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమి మాట్లాడతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వైఎస్సార్‌సీపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రజలకు కొన్ని కీలక సందేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేసిన విషయం, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం వంటి అంశాలపై జగన్ స్పందించే అవకాశముంది. ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌లుగా మారాయి.
‘వీరమల్లు’ లో ఐటెం సాంగ్.. కానీ పవన్ ఏమన్నారంటే !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి – జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 12న ఈ సినిమా విడుదలవుతున్న నైపద్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌తో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పాటలు ఎంతో ఆకట్టుకోగా తాజాగా ఈ చిత్రం నుంచి మూడో గీతంగా ‘అసుర హననం’ విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతలతో నిర్వహించడం విశేషం. ఇందులో భాగంగా కీరవాణి మాట్లాడుతూ.. ‘ ‘హరి హర వీరమల్లు’ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్)తో మొదలైంది, ఇప్పుడు జ్యోతి కృష్ణ తో పూర్తవుతుంది. నేను చాలామంది దర్శకులను చూశాను. కానీ, తక్కువ మందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంది.. ‘తార సితార’ అంటూ సాగే ఈ పాటలో కొన్ని లైన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని పవన్ తెలిపారు.. ఆయన ప్రస్తుతం బాధ్యతాయుతమైన పదవిలో ఉండటంతో ఇలాంటి లైన్స్ వాడకూడదని తెలిపారు. వాటిని మార్పించి ఆ తర్వాత తిరిగి సాంగ్ రికార్డింగ్ చేయించాము’ అని కీరవాణి అన్నారు.
ఢిల్లీకి పయనం కానున్న సీఎం.. పలు కేంద్రమంత్రులతో సమావేశాలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు రోజులపాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కావనున్నట్టు సమాచారం. పెట్టుబడులు, అభివృద్ధి ప్రాధాన్యతలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది.
‘గెట్ అవుట్’.. రిపోర్టర్‌పై ట్రంప్ ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఫైరయ్యారు. ఆ రిపోర్టర్‌ను ‘గెట్ అవుట్’ అన్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. బుధవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సమావేశం అయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడుతుండగా సడన్‌గా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్‌బీసీ విలేకరి వివాదాస్పదమైన ఖతార్ విమానాన్ని గురించి ప్రశ్నించాడు. అలాంటి బహుమతిని స్వీకరించడం నైతికమైనదా? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ట్రంప్‌నకు కోపం తెప్పింది. ‘‘నీవు చెడ్డ రిపోర్టర్‌వి.. నీవు నీ గురించి సిగ్గుపడాలి’’ అని ఫైరయ్యారు. రిపోర్టర్ మరిన్ని ప్రశ్నలు సంధించబోతుండగా ట్రంప్ అడ్డు తగులారు. ‘‘అయినా ఖతార్ జెట్‌తో నీకేం పని.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఖతార్ వాళ్లు అమెరికా వైమానిక దళానికి బహుమతిగా ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. అసలు నీకు తెలివిలేదు. నువ్వు ఏం అడుగుతున్నావో నీకే తెలియదు. ముందు నీ ఆఫీస్‌కు వెళ్లు. మీ మాతృసంస్థపై దర్యాప్తు చేయాలి. గెట్ అవుట్’’’ అంటూ ట్రంప్ చిందులేశారు.
ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం! నెతన్యాహు ప్రకటన
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వార్ చనిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గత 5 నెలల్లో తొలిసారి బుధవారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. హమాస్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ చనిపోయి ఉంటాడని పేర్కొన్నారు. మే నెల ప్రారంభంలో దక్షిణ గాజాలోని ఒక ఆస్పత్రిపై ఐడీఎఫ్ దాడి చేసింది. ఆ దాడిలో మొహమ్మద్ సిన్వార్ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతడి మరణవార్తను ఇప్పటి వరకు హమాస్ నిర్ధారించలేదు. 2024, అక్టోబర్‌లో యాహ్యా సిన్వార్ హతమయ్యాడు. అనంతరం అతని సోదరుడు మొహమ్మద్ సిన్వార్ గాజా ప్రాంతంలో హమాస్‌కు నాయకుడయ్యాడు. ప్రస్తుతం అతడి కూడా చనిపోయినట్లు నెతన్యాహు పేర్కొన్నారు. దీనిపై మరింత క్లారిటీ రావల్సి ఉంది.
వేకువజామునే పని మొదలెట్టిన హైడ్రా..
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో శ్మశాన వాటికలపై జరిగిన అక్రమ కబ్జాలను తొలగించేందుకు అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున నుంచే హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు. పర్వతాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 1, 12లో ఉన్న ముస్లిం , క్రిస్టియన్ శ్మశాన వాటికలపై కొంతకాలంగా భూకబ్జాదారులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు నిర్వహించినట్లు సమాచారం. గత రెండు ఏళ్లుగా ఈ శ్మశాన భూములపై కొనసాగుతున్న ఆక్రమణలకు శాశ్వత full stop పెట్టే క్రమంలో, అధికారులు పక్కా పథకంతో కూల్చివేతలకు దిగారు.
బాలీవుడ్ నుంచి మరో చరిత్రాత్మక చిత్రం..
బాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘ఛావా’ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘ఛావా’ సినిమా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో విక్కీ కౌశల్ మరాఠా యోధుడి పాత్రలో నటించి అభిమానుల మెప్పు పొందగా. శంభాజీ భార్యగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కిస్తే రికార్డు వసూళ్లు వచ్చాయి. మరి అలాంటిది శివాజీ మహారాజ్ పైనే తెరకెక్కిస్తే? దాని హైప్ ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.