బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. బుద్ధ భవన్ పక్కనే వున్న భవనంలో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. హైడ్రా పోలీసు స్టేషన్‌కు ఉద్దేశించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు.
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. తాజాగా.. నగరంలోని ఫిల్మ్ నగర్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఆక్రమణలను హైడ్రా (HYDRA) తొలగించింది. ఫిలింనగర్‌లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడంపై స్థానికుల ఫిర్యాదుతో.. హైడ్రా ఫిలింనగర్ లేఅవుట్‌ను పరిశీలించింది. ఈ క్రమంలో.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించింది.
HYDRA Law: చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.