HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
- 'హైడ్రా' కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు..
- త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA Law: హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ‘హైడ్రా’ పేరు మారుమోగుతోంది. నగరంలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటూ.. ఈ హైడ్రామా ఇప్పుడు హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలకు గురైన భూములను కాపాడేందుకు “హైడ్రా” తీవ్రంగా కృషి చేస్తోంది. ఆకాశమంత ఎత్తైన భవనాలను సైతం బుల్ డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఈ హైడ్రామాకు ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చింది.
Read also: Osmania Hospital: 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా దవాఖానా.. ఎక్కడో తెలుసా?
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
అయితే.. ఈ క్రమంలో ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రామా పేరుతో నిర్వాసితులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులో ఉంచుతామని, ఇక్కడ ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవాళ హైడ్రా నోటీసులు ఇచ్చింది. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది.
New Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!