హైదరాబాద్ నగర అభివృద్ధి, పర్యావరణ, సిటీ మేనేజ్మెంట్ అంశాల్లో కీలక పాత్ర పోషించే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ మంగళగిరి కార్యాలయంలో సుమారు రెండు గంటలపాటు కొనసాగింది. Tirupati: విషాదం.. నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఏడుగురు యువకులు..! భేటీ కారణాలపై ప్రాథమికంగా అధికారిక ప్రకటనలు అందకపోవడంతో, ఈ సమావేశం గురించి రాజకీయ, సామాజిక…
HYDRA : నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలో 7 నుంచి 8 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదైంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షం పడే అవకాశాలను రెండు గంటల ముందుగానే గ్రహించిన హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలిస్తున్న సమయంలోనే భారీ వర్షం కురవడంతో హైడ్రా కమిషనర్ నేరుగా వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. లకడికాపూల్,…
HYDRA : హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బోరబండ, గచ్చిబౌలి, వనస్థలిపురం, బడంగిపేట తదితర ప్రాంతాల్లో నాళాలు, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు, సూచనలు చేసిన ఆయన… అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బోరబండ హైటెన్షన్ రోడ్ విస్తరణ పనులపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. నాలాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, మురుగు నీరు వరద నీటిలో కలిసిపోకుండా కిందకి పోవేలా…
HYDRA: వర్షాల వేళ.. నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. నాలా ఆక్రమణలను ప్రత్యక్షంగా చూసి వెంటనే తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నదీ పరీవాహకం కంటే.. ఎక్కువ కూకట్‌పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
Hydra : హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఆన్ లైన్ లో కూడా భారీగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు వేగంగా పనిచేస్తున్నామని రంగనాథ్ వివరించారు. హైడ్రా అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారనేదానిపై కమిషనర్ రంగనాథ్ బుధవారం ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని విధాలుగా తాము ప్రజలకు సహకరిస్తున్నామని.. ప్రభుత్వ భూముల్లో ఎవరు బిల్డింగులు కట్టినా విడిచిపెట్టేది లేదన్నారు.…
నానక్‌రామ్ గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖాజగూడ చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువు సుందరీకరణ పనులు స్పీడప్ చేయాలని దత్తత తీసుకున్న సంస్థను కోరారు.
Hydra Commissioner: అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు ప్లాట్ల కొలతలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఆపై హైడ్రా కమిషనర్ ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో ముచ్చటిస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో “తెలుగు వచ్చా?”…
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (జనవరి 27) బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు ఫిర్యాదులు తీసుకుంటారు. ఫిర్యాదుకు సంబంధించిన తగిన ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలను ఫిర్యాదుదారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హైడ్రా ప్రజావాణికి మద్దతు భారీగా పెరిగింది. Also…