Hyderabad: హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురలో మాతాకీ కిడ్కి ప్రాంతంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో, అక్రమంగా పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వాటిని వివిధ వివాహాలు, హోటల్స్‌కి సరఫరా చేస్తున్న మహమ్మద్ మిస్బాహుద్దీన్ అనే 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహమ్మద్ మిస్బాహుద్దీన్ తన వద్ద 2 క్వింటాళ్ల పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి వాటిని తక్కువ ధరకు వివాహాలు, హోటల్స్‌కి విక్రయిస్తున్నాడు. పోలీసులు అతని వద్ద నుంచి పాడైన మాంసం సీజ్ చేసి ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకున్నారు.
Read Also: Jamuna Tudu: ఎవరు ఈ ‘లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా’? 50 హెక్టార్ల అడవిని ఎలా కాపాడింది!
ఈ దాడి జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో, కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులతో సహా విస్తృతంగా నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం కూడా గోషామహల్ ప్రాంతంలో కూడా పాడైన మాంసం అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న విషయం గుర్తించి భారీగా పాడైన మాంసం సీజ్ చేయడం జరిగింది. అయితే, ఈ దందా ఓల్డ్ సిటీలో ఎక్కువగా సాగుతోందని అధికారులు గుర్తించారు. పాడైన ఈ మాంసం అతి తక్కువ ధరలో విక్రయించడంతో కొనడానికి ప్రజలు తెగ ఉత్సహం చూపుతున్నారు. అయితే వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తప్పకుండా ఎదురుకోవాల్సిందే.