నగరంలో విదేశీ మద్యం కలకలం రేపింది. నారాయణగూడలో భారీ మొత్తంలో ఫారెన్ లిక్కర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 233 బాటిల్స్ ఫారెన్ లిక్కర్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో 2003 ఫారిన్ లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న విదేశీ మద్యం విలువ పది లక్షల పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. విదేశీ మద్యంతో పాటు ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు.
Also Read:Nalgonda: మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. పౌల్ట్రీ ఫామ్‌లో రెండు లక్షల కోళ్ళు
మద్యం టెండర్లలో దుకాణం రాకపోవడంతో ఇల్లీగల్ గా ఫారెన్ లిక్కర్స్ బిజినెస్ చేస్తున్న నిందితులు. 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పించి హరీష్ కుమార్ ఇర్వాణి అమ్ముతున్నట్లు గుర్తించారు. దోమలగూడకు చెందిన హరీష్ కుమార్ ఇర్వాణి, విలియమ్స్ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, ధర్మబట్టి, సునీల్ పై కూడా కేసులు నమోదు చేశారు.