Jupally Krishna Rao: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉండేది.. కానీ ఇప్పుడు ప్రాతినిధ్యం స్థాయి నుంచి పతకాలు అందించే స్థాయికి ఎదిగారని అన్నారు.
Minister Ponnam: హైదరాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి పనులపై చర్చించాం అని తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.
BRS Party: హైదరాబాద్ మెట్రో టికెట్ ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు.
MLA Sudheer Reddy: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్మూలాట కొనసాగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ వివాదంపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని తేల్చి చెప్పారు. మేమంతా కలిసికట్టుగా పార్టీ కోసం పని చేస్తున్నాం అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదనీ గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటిడిఏ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కనీస రహదారి సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డుప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వాహనదారుడు బైక్పై తీవ్ర నిర్లక్ష్యంతో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోను చూస్తే, వ్యక్తి బైక్పై పెద్ద పెద్ద మూటలు కట్టుకొని, ఆ మూటల మధ్య ఓ మహిళను వెనుక కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు.…
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పడం లేదు. ఇటీవల మెట్రో ఛార్జీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నేటి నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. Also Read:IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునః ప్రారంభం.. ఆర్సీబీ,…
చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లో 75 తులాల బంగారు నగలు .రూ.2.50 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. ఫహిముద్దీన్ భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఫహిముద్దీన్ శుక్రవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులను ఉంచి ఆసుపత్రికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆగంతకులు ఇంటి వెనక నుంచి లోనికి ప్రవేశించారు. ఫహిముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెంపెట్టారు నిందితులు. Also Read:Doha Diamond league: నీరజ్…
GHMC: మాన్సూన్ ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వి కర్ణన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు.
Traffic Restrictions: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి సక్సెస్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర రేపు హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్లో రేపు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్బండ్ దగ్గర ఈ యాత్ర కొనసాగనుండటంతో.. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.