అబ్దుల్లాపూర్మెట్టు, కుంట్లూరులో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణ సహాయం క్రింద లక్ష రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెంట్ రెవెన్యూ పరిధిలోని కుంట్లూరు వద్ద గల రావినారాయణ రెడ్డి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని సాంబశివరావు పరిశీలించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు 300ల వరకు గుడిసెలు కాలి పోయాయని, గ్యాస్ సిలెండర్స్ పేలడం వలన…
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ పై దౌత్య దాడికి దిగింది. ఇందులో భాగంగా భారత్ లో ఉన్నటువంటి పాక్ పౌరులను ఆ దేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాదులోని పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో నోటీసులు అందజేశారు అధికారులు. హైదరాబాదులో మొత్తం 230 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టైం వీసాలు ఉన్నాయని గుర్తించారు. Also Read:Himanta Biswa Sarma: ‘‘మీ…
Hyderabad: హైదరాబాద్ లో కార్ఖానా ప్రాంతానికి చెందిన జవేరియా రిజ్వానా తన కొడుకు మాజ్అమ్మద్, కూతురుతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళింది. అర్ధరాత్రి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ర్యాపిడూ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ప్యారడైజ్ దగ్గరకు రాగానే రిజ్వానా ప్రయాణిస్తున్న ఆటోను నలుగురు యువకులు వెంబడించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మీద బోలెడు ఆశలు పెట్టుకుంది తెలంగాణ బీజేపీ. వాస్తవంగా మాట్లాడుకుంటే.... ఆ పార్టీకి సీటు గెలిచేంత బలం లేదు. ఆ విషయం పార్టీ ముఖ్యులు అందరికీ తెలుసు. పిక్చర్ క్లియర్గా ఉంది. అయినా సరే... ఉనికి కోసం బరిలో దిగింది కాషాయ దళం. అంతవరకు బాగానే ఉంది. కానీ.... ఆ పోటీ పేరుతో తమను తాము పరీక్షించుకునే దగ్గరే తేడా కొట్టిందంటున్నారు పరిశీలకులు. బీజేపీ కార్పొరేటర్స్ అందరి ఓట్లు కమలానికి…
DGP Jitender: NTVతో తెలంగాణ డీజీపి జితేందర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
మదర్సలోఉన్న పిల్లలు ఈ దేశం పిల్లలు అని మీ ఎస్పీ చెప్పగలరా అని ఎంపీ రఘునందన్ రావు అడిగారు. టోపీ పెట్టుకుంటే మనోడు అని కాపాడుతున్నారు.. అక్కడ మదర్సలో ఉండే 12 ఏండ్లలోపు పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు.
కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.