ఇప్పటివరకు హైదరాబాద్ శివార్లకు పరిమితమైన బైక్ రేసింగ్ కల్చర్ ఇప్పుడు సీటీ నడిబొడ్డుకు పాకింది. నిత్యం రద్దీగా వుండే రోడ్లపై, రాత్రి సమయాల్లో వీధుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ హైదరాబాద్ యువత రేసింగ్ లకు పాల్పడుతున్నారు. రాత్రి సమయాలలో పాల్పడే బైక్ రేసింగ్లు కోవిడ్ వల్ల అర్ధరాత్రి నైట్ కర్ఫ్యూ విధించడం తో ఆదివారం సాయంత్రం సమయంలో బైక్ రేసింగ్ కి పాల్పడుతున్నారు రేసర్లు. అతి వేగంగా రోడ్ల పై 30 నుండి 40 వాహనాలతో రేస్…
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టమే జరిగింది.. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు.. రైతులకు కడగళ్లు మిగిల్చాయి.. అయితే, మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని సూచించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, మరత్వాడా నుండి ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ కోస్తా తమళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9…
భారత దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించే సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మౌళిక వసతుల పరిమితుల కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉన్న పరీక్షా కేంద్రాలు నానాటికీ పెరుగుతున్న రోగుల సంఖ్యకనుగుణంగా సేవలు అందించలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ వ్యాధి నిర్థారణలో కీలకమైన కోవిడ్-19 ఆర్ టి పీసీయార్ (ఐసియంఆర్ వారి అనుమతులకనుగుణంగా) పరీక్షలకు వారికి అందించడానికై వీలుగా అపోలో…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ లిస్ట్ లో తెలంగాణ కూడా చేరిన విషయం తెలిసిందే. నిన్నటి నుండే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. దీంతో మళ్ళీ రైల్వే స్టేషన్ల వద్ద వలస కూలీల ఎదురు చూపులు కనిపిస్తున్నాయి. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద వందలాది మంది వలస కూలీలు పిల్లా, పాపలతో సహా…
తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.. ఇప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి అక్కడక్కడ భారీ గాలులతో కూడా వర్షాలు కురుస్తుండగా.. ఇప్పుడు విదర్భ మరియు మరత్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి మి నుండి 2.1 కిమి ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడింది.. ఈ రోజు ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,542 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.67 లక్షలకు చేరింది. ఇందులో 3.19 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 46,488 కేసులు యాక్టివ్ గా…
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, దేశంలో వ్యాక్సినేషన్, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రధాని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10…
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే, ఈరోజు రాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలు సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఎల్పీజీ, సిఎన్జీ, గ్యాస్, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు యధావిధిగా నడుస్తాయి. …
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి. కాగా,…
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్లు చేయించుకున్నారు.. అయితే,…