తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 746 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఐదుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 729 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,37,373కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,23,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,764కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.29 శాతంగా…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్.. నా హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడం సంచలనంగా మారింది.. నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు.. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చింది. నన్ను నరహంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు.. ఈ చిల్లర ప్రయత్నాలకు ఏనాడూ కూడా భయపడం.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అంటూ ఆయన కామెంట్ చేశారు.. అయితే, ఈటల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి గంగుల కమలాకర్.. ఈటల…
తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు సైబర్ కేటుగాళ్లు కన్నం వేశారు.. బ్యాంక్ ఖాతాల్లోకి ప్రవేశించి దాదాపుగా రూ.2 కోట్లు కాజేశారు.. అయితే, ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. బ్యాంక్ మూల ధనం నుంచి రెండు కోట్లు కొట్టివేసిన నైజీరియన్‌ను పట్టుకున్నారు సీసీఎస్ పోలీసులు.. దీంతో అపెక్స్ బ్యాంకులో నగదు మాయం కేసులో అరెస్ట్‌ల సంఖ్య రెండుకు చేరింది.. హైదరాబాద్ టోలిచౌకిలో నివాసముంటున్న నైజీరియన్ లేవి డైలాన్ రోవాన్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు…
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుతం వారి వేతనం నెలకు రూ.15 వేలు ఉండగా.. దానిని రూ.28,719కి పెంచింది నిర్ణయం తీసుకుంది.. ఈ నెల నుంచే పెరిగిన వేతనాలను జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చెల్లించనుంది సర్కార్.. ఇక, ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్…
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి హైదరాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన ఓ ప్రయాణికుడి దగ్గర రూ.25 కోట్ల విలువ చేసే 3.2 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు.. సినీ పక్కీలో మాదకద్రవ్యాలను మలద్వారంలో తరలిస్తుండగా.. కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు.. ఇక, 3.2 కిలోల హెరెయిన్‌ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ మధ్య తరచూ దేశంలోని అంతర్జాతీయ…
దేశంలో బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. పుత్తడిని కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 తగ్గి 44,990కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గి రూ.49,000కి చేరింది. ఇక ఇదిలా…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత చుట్టు పక్కల కాలనీల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇబ్బంది మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ కు సూచించారు. నూతనంగా సహాయమంత్రిగా నియమితులైన అజయ్ భట్, ఆదివారం నాడు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో, వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. read also : ముగిసిన శ్రీలంక ఇన్నింగ్స్…ఇండియా టార్గెట్ ఎంతంటే ? ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్…
సమ్మర్లో చికెన్‌కు డిమాండ్ తగ్గినప్పట్టికి గత కొన్ని రోజులుగా చికెన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే చికెన్ తినాలని నిపుణులు చెబుతుండటంతో చికెన్ తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ధరలు కూడా అమాంతం పెరిగాయి. నగరంలో కిలో చికెన్ ధర రూ.250 పలుకుతుండగా, మటన్ ధర రూ.720కి చేరింది. ఇక నాటుకోడి చికెన్ 700 వరకు పలుకుతున్నది. Read: గ్లోబల్ స్టార్ హీరోయిన్ కి.. మెగా హీరో…
గత కొన్ని రోజులుగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, భాగ్యనగరంలో ప్రతిరోజూ మద్యాహ్నం సమయంలో వర్షం కురుస్తున్నది. ఈ రోజు కూడా నగరంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి రోడ్లన్నీ తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లొకి వర్షం నీరు చేరుతున్నది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అబిడ్స్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, ఎంజే…
దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.45,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల…