పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ కేసులో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.. దీంతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు.. కాగా, మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. దానిపై విచారణ జరిపిన హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో… ఎంపీ కవిత 10 వేల రూపాయలు జరిమానా చెల్లించారు.. అలాగే బెయిల్ కోసం మాలోత్ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ కూడా మంజూరు చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు.