ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకొస్తారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారు.. ఆయనపై రకరకాల ప్రచారం కూడా జరుగుతోంది.. అయితే, తాను వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలపై స్పందించిన ఆయన.. పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ లో పోలీస్ కేస్ పెట్టారని.. కానీ, కేసులకు భయపడేదిలేదన్నారు.. రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన.. సీఎం.. హుజరాబాద్ లో ఖర్చు పెట్టే వెయ్యి కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చుపెట్టాలని సూచించారు.. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు ఉన్నారన్న ఆయన.. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారని హెచ్చరించారు.
తాము బహుజన రాజ్యం సృష్టించుకుంటామని ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం మోసం చేస్తారు,అలాంటివి మళ్ళీ రానీయకండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన.. ఇటువంటి అవకాశము వెయ్యి ఏళ్ళు వరుకు రాదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయింది, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ బతుకులు మార్చడానికే నేను రాజీనామా చేసి త్యాగం చేసి వచ్చానన్నారు.. మాకు నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం కావాలి.. మీ బిడ్డ గా ప్రశ్నించడానికి నేను రాజీనామా చేసి వచ్చాను.. ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబంలో చాలా బాధ ఉంటుందన్నారు.. కోట్ల మంది బాగుపడాలనే నేను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించార ప్రవీణ్ కుమార్.
Also Read
- Tags
- hyderabad
తాజావార్తలు
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!