తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సాగనున్న సంజయ్ పాదయాత్ర.. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.. ఆగస్టు 24న హైదరాబాద్ ఓల్డ్సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. అయితే, మరోసారి సంజయ్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది… ఎందుకంటే.. యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ శనివారం కన్నుమూశారు..…
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 44,150 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 48,170 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక బంగారం ధరలు దారిలోనే…
కరోనాను తరిమేసేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. సాధ్యమైనంత త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు.. ఇందులో భాగంగా రెగ్యులర్గా ప్రభుత్వ ఆస్పత్రలు, పీహెచ్సీ సెంటర్లలో.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సాగుతున్నా.. మరింత విస్తృతంగా వ్యాక్సిన్ వేయాలన్న ఉద్దేశంతో.. జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఏరియాలలో కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నెల 23వ తేదీ నుండి 10-15 రోజుల పాటు ఈ స్పెషల్…
20 నెలలు మనకు సవాల్… మన టార్గెట్ 72 సీట్లు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మణికమ్ ఠాగూర్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.. యూత్ కాంగ్రెస్ నుండి నాయకులుగా ఎదిగిన వాళ్లే ఎక్కువగా పార్టీలో ఉన్నారని గుర్తుచేసిన ఆయన.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఏఐసీసీ కార్యదర్శులు కూడా అయ్యారన్నారు.. వచ్చే 20 నెలలు కష్టపడి పని…
యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి… వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులను కూడా యూత్ కాంగ్రెస్ అందించిందన్న ఆయన.. యూత్ కాంగ్రెస్ వాళ్లు టికెట్ల అడిగే ముందు… ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడినరో చూస్తాం అన్నారు.. టికెట్ తీసుకుని జనంలోకి పోతా అంటే… ఓడిపోతారు అని హితవుపలికిన రేవంత్రెడ్డి.. పోటీ చేసి ఓడిపోతే బాల్య వితంతులుగా మారిపోతారని.. చేతికి మట్టి అంటకుండా యూత్ కాంగ్రెస్ నాయకుడిని అంటే…
రైల్వే ప్రయాణికులకు అప్రమత్తం కావాల్సిన సమయంలో… ఇవాళ్లి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలతో పాటు.. పలు సేవలకు తాతాల్కికంగా బ్రేక్ పడనుంది.. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్న కారణంగా.. చార్టింగ్, కరెంట్ బుకింగ్, పీఆర్ఎస్ ఎంక్వైరీ, టికెట్ రద్దు, చార్జీలు రీఫండ్ తదితర పీఆర్ఎస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయని తెలిపింది దక్షిణమధ్య రైల్వే అధికారులు. ఇవాళ రాత్రి 11.45 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు.. ఈ…
చేతి (కాంగ్రెస్ పార్టీ) దెబ్బకు కారు (టీఆర్ఎస్), పువ్వు (బీజేపీ) పల్టీ కొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. ధరల పెరుగుదలపై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయాలని సూచించారు.. సీఎం కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయిన మధు యాష్కీ..…
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీష్రావు ఎన్నికయ్యారు.. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీష్రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది.. ఇక, తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని..…
ఈ రోజు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర జరగనుంది. ఇందుకోసం వస్తున్న కేంద్రమంత్రికి ఘట్కేసర్ వద్ద స్వాగతం పలకనున్నారు మేడ్చల్ జిల్లా బీజేపీ అధికారులు.నేడు మధ్యహ్నం 12 గంటలకు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కిషన్ రెడ్డికి హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకనున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50కిలోమీటర్ల జన ఆశీర్వాద యాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ, కిషన్…