తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో.. హైకోర్టు సీజే పోస్టు ఖాళీ ఏర్పడింది.. దీంతో.. ఎంఎస్ రామచంద్రరావును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయిలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే వరకు.. బాధ్యతలు నిర్వహించనున్నారు ఎంఎస్ రామచంద్రరావు. కాగా, సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేయడం.. ఆ సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో.. అందులో భాగంగా.. జస్టిస్ హిమా కోహ్లీ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.