కొత్త కొత్త చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు పడుతున్నా… చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆడవారిపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది నాంపల్లి కోర్టు… ఈ కేసులో హోంగార్డ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకరాంగేట్‌లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు మల్లికార్జున్ అనే హోం గార్డు.. కేసు నమోదు చేసిన పోలీసులు..…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ… ఈ మధ్యే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పీసీసీ చీఫ్ పదవితో పాటు.. వివిధ కమిటీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. ఇక, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చిందనే టాక్ నడుస్తోంది.. మరోవైపు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… వారికి పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ…
ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకు చలానా విధించినా వాహనదారులు వాటికి కట్టకుండా లైట్‌గా తీసుకొని వాహనలు నడుపుతున్నారు. తీరిగ్గా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అంటున్నారు. అయితే, ఇకపై అలాంటి ఆటలు సాగవని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహనంపై ఏ ఒక్క చలానా కూడా పెండింగ్‌లో ఉండకూడదని, ఒకవేళ పెండింగ్‌లో చలానాలు ఉంటే వాహనాన్ని వెంటనే సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వాహనానికి సంబందించి ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా…
కరోనా సెకండ్ వేవ్ తరువాత మార్కెట్లు వేగంగా పుంజుకుంటున్నాయి. అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవడంతో మార్కెట్లు తిరిగి పాత సోభను సంతరించుకుంటున్నాయి. కరోనా సమయంలో పైపైకి కదిలి సామాన్యుడు కొనలేనంతగా మారిపోయిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉన్నది. ప్రస్తుతం ధర రూ.…
కరోనా మహమ్మారి సమయంలో పూర్తిగా కోవిడ్ రోగుల సేవలకే పరిమితం అయ్యింది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి… మొదటి వేవ్ తగ్గిన తర్వాత నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించినా.. మళ్లీ సెకండ్ వేవ్ పంజా విసరడంతో.. కోవిడ్ సేవలకే పరిమితం అయ్యింది… అయితే, క్రమంగా ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. రేపటి నుంచి మళ్లీ సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. కోవిడ్…
హైదరాబాద్‌లో ఘనంగా బోనాలు జరుగుతున్నాయి.. ఓల్డ్ సిటీ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి… వైపీసీ ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికింది లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ… ఇక, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వమించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తాను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశానని గుర్తుచేసుకున్నారు.. నేను వైసీపీ ఎమ్మెల్యేను,…
హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బీజేపీ నేత ఈటల రాజేందర్… వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించగా.. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాఘునందర్‌రావు పరామర్శించారు.. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్… ఈటల ఆరోగ్య…
తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల టీపీసీ చీఫ్రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి సభకు పిలుపునివ్వడంపై పార్టీలోని కొందరు నేతలు అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. తమకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై గాంధీ భవన్లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంద్రవెల్లి…
ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో నగరంలో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి. ఇక పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 8…