హైదరాబాద్‌లో టూ లెట్ బోర్డు పెట్టినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జరిమానా విధిస్తుందంటూ ఓ వార్త హల్ చల్ చేసింది.. ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లోని అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, వాల్ రైటింగ్ తదితరాలపై అధికారులు జరిమానా విధించడంతో ఓ ప్రచారం మొదలైంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది జీహెచ్ఎంసీ.. సొంత ఇంటికి టూ లెట్ బోర్డు పెట్టినా ఫైన్ అని వచ్చిన వార్తలను ఖండించింది..…
హైదరాబాద్ లో గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల కు నేటి తో 14 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు 25 హైదరాబాద్ లో జంట పేలుళ్లు జరిగాయి. జంట పేలుళ్లలో మొత్తం 44 మంది మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు. 14 ఏళ్ళు అయిన ఇంకా ఆ రక్త మరకలు మారలేదు. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్ధిన్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నింది. ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష…
దేశంలో అత్యధికంగా సేల్ అయ్యే వాటిల్లో పుత్తడి కూడా ఒకటి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. అంతర్జాతీయంగా ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.44,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిది రూ.48,490కి చేరింది. పుత్తడి ధరలతో పాటుగా వెండి…
తెలంగాణలో అక్టోబర్ నెలతో ఇప్పుడున్న 2,216 లిక్కర్ షాపుల లైసెన్సులు ముగియనున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన తరువాత మద్యం షాపుల వేలం ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరినాటికి కొత్త మద్యం పాలసీని అమలులోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇక ఈ వేలం లైసెన్స్ ఫీజులు పెంచాలని ప్రభుత్వం చూస్తున్నది. దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 2,216 లిక్కర్ షాపులతో పాటుగా…
రాత్రి సమయంలో ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించేందుకు వందల సంఖ్యలో నగరవాసులు అక్కడికి వస్తుంటారు. ఒకవైపు పర్యాటకులతో పాటు, ట్రాఫిక్ రద్ధీకూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ రద్ధీ అధికం. దీంతో ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరవాసుల ట్యాంక్‌బండ్ సందర్శనకు…
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు కాస్త ఊరట కలిగించాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, డీజిల్ పై 16 పైసలు తగ్గింది. తాజా ధరల ప్రకారం… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.…
మన దేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 44,250 కి…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ప్రాణాలు వదిలింది.. పీజీ చేస్తున్న మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని తనువు చాలింది… హెచ్‌సీయూలోని హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మౌనిక.. ఇక, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు… తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే మౌనిక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.. చదువు ఎంత చదివినా నా మనసులోకి ఎక్కడం లేదని సూసైడ్‌లో మౌనిక పేర్కొన్నట్టు తెలియజేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ…
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇవాళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ మేరకు ఎల్లో వార్నింగ్ కూడా జారీ చేసింది.. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీని కారణం.. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ…
మియాపూర్‌లో కలకలం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 జనవరి 19వ తేదీన ఓ మహిళపై హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో సామూహిక అత్యాచారం జరిగింది.. ఏడుగురు కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, ఎల్బీనగర్ న్యాయస్థానంలో తగిన ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించడంతో విచారణ చేపట్టిన కోర్టు.. నిందితులకు జీవితఖైదు…