మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్‌కే నా సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్ చివరకు సీఎం కేసీఆర్ పైకి మళ్లింది… గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మల్లా రెడ్డిపై మరోసారి భూ కబ్జా, అవినీతి, అక్రమ ఆరోపణలు చేశారు.. ఈ సందర్భంగా ఇవిగో ఆధారాలంటూ కొన్ని పత్రాలను కూడా బయటపెట్టారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్‌పై స్పందించిన ఆయన.. సవాల్ మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్‌కే విసురుతున్నా అన్నారు.. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద కదా? అని ప్రశ్నించారు.. అది సెమీ ఫైనల్.. ఇక మిగిలింది ఫైనలే.. ఆ ఫైనల్ కేసీఆర్ మీదేనని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని కోరిన ఆయన.. కేసీఆర్‌కి చేతనైతే రావాలని డిమాండ్ చేశారు.
ఇక, కేటీఆర్ విమర్శలపై స్పందిస్తూ.. చంద్రబాబు చెప్పులు మోసి బతికిందే కేసీఆర్ అంటూ కౌంటర్ ఇచ్చారు.. మరోవైపు.. కేటీఆర్… పేరే టీడీపీది అంటూ ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి… కేటీఆర్.. రకుల్ రావు అని పెట్టుకో అంటూ కామెంట్ చేశారు.. కేసీఆర్, కేటీఆర్ కి సవాల్ విసురుతున్నా.. ముందస్తు ఎన్నికలకు రండి.. మేం మా బలం ఏంటో చూపిస్తాం అన్నారు.. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు కేటీఆర్ ఒప్పుకోకపోతే… సీఎం కేసీఆర్ రాజీనామా చేసి వచ్చినా.. గజ్వేల్ లో పోటీ చేస్తానన్నారు.. మేమేంటో మా బలం ఏంటో చూపిస్తాం.. టీఆర్ఎస్ గెలుస్తుందా..? కాంగ్రెస్ గెలుస్తుందా తేల్చుకుందాం అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
Also Read
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!