కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన స్కూళ్లు, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోన్నాయి.. అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునర్ ప్రారంభించాలని ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను ఆదేశించారు సీఎం…
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం… విద్యా సంస్థలు తెరవచ్చని నివేదిక ఇచ్చింది వైద్య ఆరోగ్యశాఖ.. దీంతో.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.. 1వ తేదీ నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్… విద్యాశాఖ మంత్ర సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో.. ఇవాళ విద్యాశాఖ అధికారులు కూడా నివేదిక ఇచ్చారు. దీనిని…
హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురుస్తోంది… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట, అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది… దీంతో.. ప్రధాన రహదారులపై వరద నీరు పొంగిపొర్లుతోంది.. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన జంక్షన్లలో సైతం రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరింది.. దీంతో.. పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు…
కరోనా మహమ్మారి కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి… సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. మరోవైపు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు మాత్రం ఆందోళన కలగిస్తున్నాయి.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… కరోనా థర్డ్ వేవ్ ఆలోచన కూడా రాకూడదన్నారు. థర్డ్ వేవ్ ముప్పు రాదన్న ఆయన.. అయితే, ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో థర్డ్ వేవ్ వస్తే.. ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని…
కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. మధ్యలో కొంతకాలం మినహా దాదాపు 18 నెలలుగా ఆన్లైన్ పద్ధతిలోనే విద్యా బోధన సాగుతోంది.. అయితే, ప్రత్యక్ష బోధనకు అనుమతించాలంటూ విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. కోవిడ్ తీవ్రత తగ్గిందని, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు సరైన వాతావరణం నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ సైతం పేర్కొంది. పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యక్ష…
ప్రజాగాయకుడు గద్దర్ ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో చర్చించిన ఆయన.. తనపై ఉన్న కేసులు అన్నీ ఎత్తివేయాలని కోరారు.. ఇక, ఈ కేసులపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్మెంట్ ఇప్పించాలని.. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని కోరారు గద్దర్.. కాగా, గతంలో తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి, న్యాయసహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని గతంలో విజ్ఞప్తి చేశారు గద్దర్.. ప్రభుత్వం పిలుపు…
హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పరుపుల గోదాంలో మంటలు చెలరేగాయ్. ఐతే…మంటలను గమనించిన కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించాయి. పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…మంటలను అదుపు చేస్తున్నారు. గోదాంలోంచి కార్మికులు బయటకు రావటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై క్లారిటీ…
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ అరకోటి మందికి పైగా టీకాలు అందిస్తున్నారు. ఇక తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. కాలనీలు, బస్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహనాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించనున్నారు. 10 రోజులపాటు అర్హులైన అందరికీ వ్యాక్సిన్లు అందింబోతున్నారు. వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్…
పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరోసారి బంగారం ధర తగ్గింది.. గత కొన్ని రోజులుగా పెరిగిన పుత్తడి ధరలు.. నిన్న మరియు ఇవాళ కిందకు దిగుతూ కాస్త ఊరట కలిగించింది.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గడంతో.. రూ.48,160కు దిగివచ్చింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో రూ. 44,140 కు క్షీణించింది. ఇవాళ బంగారం ధర తగ్గగా… మరోవైపు…
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి గాజులరామారంలో మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. మూడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంతో భవానీ అనే వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.