వినాయక నిమజ్జనం.. 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రకు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర.. ఓల్డ్‌సిటీ చార్మినార్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.. ఇక, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో గణనాథులు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తారు.. ఈసారి వినాయక నిమజ్జనానికి భారీ బందోస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం… వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు పోలీసులు. ఇక, శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధం విధించారు.. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లించారు అధికారులు..
విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.. నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకుంటే.. 040-27852482, 94905 98985, 90103 03626 నెంబర్లకు సంప్రదించవచ్చునని పోలీసులు వెల్లడించారు.. ఇక, గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు..
Also Read
గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఇలా..
- బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర ఫలక్‌నుమా నుంచి వచ్చే శోభాయాత్ర.. చార్మినార్, అఫ్జల్‌గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్‌కు విగ్రహాలు తరలించనున్నారు.
- బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్‌గంజ్ గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు..
- సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వైపు విగ్రహాల మళ్లింపు.
- ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్‌పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు.
- దిల్సుఖ్నగర్, ఐఎస్‌సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు..
- టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లింపు.
- మెహిదీపట్నం, తపచ్ బుత్రా, ఆసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి.
- ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనుంది.
అయితే, ఈ రూట్ మ్యాప్ లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లానని సూచిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.. ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించనున్నారు.. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు..
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!