దేశవ్యాప్తంగా వరుసగా ఐదో రోజు పెరిగాయి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 103.84 కాగా… లీటర్ డీజిల్ రూ. 92.47 గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ రూ. 109.84, కాగా… డీజిల్ రూ .100.29 కు పెరిగింది.కోల్‌కతాలో పెట్రోల్ రూ. 104.52 కాగా.. డీజిల్ రూ. 95.58 గా నమోదైంది. అలాగే… చెన్నైలో పెట్రోల్ రూ .101.27 నమోదు కాగా.. డీజిల్ రూ. 96.93కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.02 కు చేరగా… డీజిల్ లీటర్ రూ.100.89 నమోదైంది. ఇక పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై సామన్య ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.