బంగారం… దీనికి ఉన్న విలువ ప్రపంచంలో దేనికి ఉండదు. మన ఇండియాలోనైతే.. బంగారానికి ఉన్న క్రేజ్ మరేదానికి లేదు. బంగారం కొనడానికి మహిళలకు బాగా ఇష్ట పడతారు. అయితే… మన దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉండకుండా…. పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన.. పసిడి ధరలు ఇవాళ మరోసారి ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44, 550 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరిగి రూ. 48, 600 కి చేరింది. ఇక అటు వెండి ధరలు కూడా ఇవాళ కాస్త పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1500 పెరిగి రూ. 70,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.