హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రతి 5 వేల నుంచి 10 వేల వరకు జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్‌రావు, షేక్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్.. దూల్పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ప్రజల వద్దకే…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిపై యువతి లైంగిక దాడి చేయడమే కాకుండా అతడిని బెదిరించి రూ.16 లక్షల సొత్తును కాజేసింది. వివరాల్లోకి వెళ్తే… టోలిచౌకీలో నివాసం ఉంటున్న కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. అయితే ఇల్లు సద్దుతున్న క్రమంలో 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి 9వ తరగతి చదువుతున్న కుమారుడిని ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ బంగారం తీసింది తానేనని బాలుడు చెప్పడంతో తల్లి…
హైదరాబాద్ లో ఓ హోటల్లో విషాదం చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4 లో ఉన్న GIS హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందాడు. అతని వయసు 29 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ గణేష్ బతుకు తెరువు కోసం 2019లో హైదరాబాద్ వచ్చాడు. బంజారాహిల్స్‌లో జీఐఎస్ హోటల్లో సూపర్ వైజర్‌గా…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితులతో రైతు కన్నీరు పెడుతున్నాడు.. ధాన్యం మార్కెట్‌కు తరలించినా ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి.. మరోవైపు వర్షాలతో కల్లాలు, రోడ్లపైనే ధాన్యం తడిసిసోయి రైతులను కన్నీరు పెట్టిస్తుంది.. అయితే, వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. వరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించిన ఆయన.. వానాకాలం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని.. రైతుల ఆత్మహత్యలకు…
ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల ఆమె టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ అయ్యాకా ఆ ముగ్గురు సెలబ్రెటీలు ఎవరు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే శిల్ప బాధితుల్లో చాలామంది…
గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో భాగంగా కమర్షియల్ (వ్యాపార అవసరాలకు) గ్యాస్ సిలిండర్ ధరను రూ.103.50 మేర ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,174కి చేరింది. అటు హైదరాబాద్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,278గా నమోదైంది. కాగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం…
మన దేశంలో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 44,850 కి చేరింది. 10…
ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మృతిపై హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతగానో కలిసి వేసిందన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జాతీయవాదం, దేశ భక్తి మరియు మానవతా విలువలకు మారుపేరుగా నిలిచిన గొప్ప గేయ రచయిత అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. వారి మరణ వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి…
ప్రపంచంలోనే… బంగారం చాలా ఖరీదైన వస్తువు. మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి రూ. 44,950 కి చేరింది.…