ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడంతో టీఆర్ఎస్ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సంబరాల్లో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు ఇతర పార్టీ నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… ప్రతి పక్షాలు సంఖ్యా బలం లేకున్నా పోటీ చేశాయన్నారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి ఏదో రకంగా గెలవాలని చూశాయన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు…
నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు.. 226 మంది ఉపాధ్యాయుల పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.. రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు, గతంలోని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఇదే సమయంలో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది… అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని పేర్కొన్నారు.. కాగా, అల్లు అర్జున్‌తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్లో…
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో అదుపు తప్పిందో బీఎండబ్ల్యూ కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టింది కారు. బెలూన్లు తెరుచుకోవడంతో ఘోర ముప్పు తప్పింది. గాయపడ్డ వ్యక్తిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఫిలింనగర్ రామానాయుడు స్టూడియో నుంచి వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పింది బిఎండబ్ల్యు కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టిందా కారు. అతివేగం వల్ల రోడ్డు మధ్యలో…
స్వచ్ఛతలో హైదరాబాద్ నగరం ముందుంది. హైదరాబాద్ లో ఉన్న హాస్పిటలిటీ ఎక్కడా లేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా ఉంది. స్వచ్ఛతలో ఎన్నో అవార్డ్ లు హైదరాబాద్ కి వచ్చాయి అని చెప్పారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. నగరంలోని పార్క్స్, రోడ్స్, బస్ షల్టర్స్ అన్ని కూడా సుందరంగా మారాయి. నగర వాసులు స్వచ్ఛ్ ఆటోలను ఉపయోగించుకోవాలి అని సూచించారు. చెత్తని…
కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీంతో రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులు కీలకంగా మారాయి. మంచి చికిత్స పొందిన వారు కోలుకుని తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. భారత్‌లోనూ కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మాత్రం ఆస్పత్రుల్లో మంచి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎక్కువ మంది కరోనా రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మొదటి…
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు, నోటీసు వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోదాల సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. విచారణ సందర్భంగా ఉద్వేగానికిలోనైన లక్ష్మీనారాయణ.. కళ్లు తిరిగి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 గంటల పాటు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు.. 13వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు… అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో…
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్ధస్త్ షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో రాకింగ్ రాకేష్ ఒకడు. ఇతర కమెడియన్ల స్కిట్లకు భిన్నంగా రాకింగ్ రాకేష్ స్కిట్లు ఉంటాయి. అందుకే ప్రేక్షకులను అతడి స్కిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా కెరీర్ సాగిస్తున్న రాకింగ్ రాకేష్ తాజాగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. Read Also: బిగ్‌బాస్-5లో టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ విజేత అతడేనా? వివరాల్లోకి వెళ్తే… ఆదివారం నాడు శంషాబాద్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్-2022…
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలోని జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ ఫెయిర్‌లో 75 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. జేఎన్టీయూహెచ్, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు నిపుణ సంస్థ ఫౌండర్ సుభద్రారాణి తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఈ జాబ్ ఫెయిర్‌లో 150కి పైగా…
చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను తగ్గించేందుకు మోదా టెక్నాలజీ వారు సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. చేనేత పరిశ్రమ అత్యంత శ్రమతో ముడిపడి ఉంది. చేనేత కార్మికులు జాక్వర్డ్ అటాచ్‌మెంట్‌ను ఆపరేట్ చేయడానికిశారీరకంగా శ్రమించవలసి ఉంటుంది. ఇది మగ్గాలు క్లిష్టమైన నమూనాలతో బట్టలను ఉత్పత్తి చేయడానికి శ్రమపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ జాక్వర్డ్ హ్యాండ్లూమ్లతో పనిచేసేటప్పుడు నేత కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటారు, జాక్వర్డ్ బాక్స్ హెవీవెయిట్ కారణంగా, మొత్తం మగ్గం యంత్రాన్ని నేత కార్మికులు కదపాల్సి ఉంటుంది. నేత…