పసిడి ప్రేమికులకు భారీగా పెరిగిన ధరలు షాకిస్తున్నాయి.. ఈ మధ్య క్రమంగా పైకి కదులుతోన్న బంగారం ధర.. నిన్న గుడ్‌న్యూస్ చెబుతూ కిందికి దిగివచ్చింది.. కానీ, మరోసారి పైకి కదిలి మళ్లీ షాకిచ్చింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పెరుగుదల, దేశీ మార్కెట్‌లో డిమాండ్‌తో పసిడి ధర పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు..
Read Also: సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 పెరిగి.. రూ.49,420కి చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.45,300కు చేరుకుంది. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా పరుగులు పెట్టింది.. రూ.500 పెరగడంతో కిలో వెండి ధర రూ.65,100కు ఎగసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.04 శాతం పైకి కదిలిన పసిడి ధర 1798 డాలర్లకు చేరగా.. వెండి ధర మాత్రం ఔన్స్‌కు 0.12 శాతం తగ్గి 22.45 డాలర్లకు దిగివచ్చింది.