పుష్ప.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. సుకుమార్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొన్నారు అభిమానులు.. ఇక రేపే విడుదల కావడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్.. గత మూడు రోజులుగా అన్ని భాషలను కవర్ చేసుకొంటూ వచ్చిన బన్నీ ఇక చివరగా తెలుగు మీడియా ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న బన్నీ మీడియాను క్షమించమని కోరాడు.
ఇటీవల కన్నడ మీడియా ప్రెస్ మీట్ లో బన్నీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.. ప్రెస్ మీట్ కి లేట్ గా ఎందుకు వచ్చారని రిపోర్టర్ అడగడం.. అందుకు బన్నీ క్షమాపణలు చెప్పడం జరిగింది.. ఇక ఈరోజు కూడా బన్నీ ప్రెస్ మీట్ కి లేట్ గానే వచ్చాడు. అయితే ఇక్కడ రిపోర్టార్లు అడగకముందే బన్నీ.. క్షమించండి ఈరోజు కూడా ప్రెస్ మీట్ కి లేట్ గా వచ్చాను .. మిమ్మల్ని వెయిట్ చేయించాను. సారీ.. చూస్తున్నారుగా వరుస ప్రెస్ మీట్లతో బిజీగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. అయితే బన్నీ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ కన్నడ మీడియా ఎఫెక్ట్ వలనే అల్లు అర్జున్ ఈ విధంగా సారీ చెప్పాడని గుసగుసలాడుతున్నారు.