దొరికిపోయిన గచ్చిబౌలి నకిలీ సీబీఐ దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నానక్‌రాంగూడలో సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లోకి దూరిన దొంగల ముఠా.. సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేశారు.. కిలో 44 గ్రాముల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దోచేశారు.. ఇక, నకిలీ సీబీఐ అధికారులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడ్డారని.. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంవత్సరం క్రితం కలిసి పని చేసిన వ్యక్తులే దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.. నిందితులంతా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారే.. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. మరికొందరు పరారీలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక, నిందితుల నుంచి చోరికి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Read Also: నేటి నుంచి బ్యాంకుల సమ్మె.. డిమాండ్స్ ఇవే..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జశ్వంత్.. బాధితుడు సుబ్రహ్మణ్యం దగ్గరే పనిచేస్తున్నట్టుగా తేల్చారు. జశ్వంత్ తన స్నేహితుడు సందీప్‌తో కలిసి ఈ దోపిడీకి ప్లాన్ చేశాడు.. తన యజమాని వద్ద భారీగా బ్లాక్ మనీ ఉందని జశ్వంత్ ఈ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.. దొంగతనం చేసినా ఫిర్యాదు చేయడని భావించి ఈ చర్యకు పాల్పడినట్టుగా సమాచారం.. మొత్తం ఎనిమిది మందితో కలిసి ప్లాన్ చేసిన నిందితుడు.. ట్రావెల్స్ కారు మాట్లాడుకుని సీబీఐ పేరుతో ఇంట్లోకి దూరారని.. కారు నంబర్ ప్లేట్ కూడా మార్చారని.. రెండు నెలల నుంచే ప్లాన్ చేశారని.. నిందితులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!