ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి.. చాలా మంది ఇష్ట పడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు… తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,760 కి చేరింది.…
హైదరాబాద్ టీఆర్ఎస్ హయాంలో గ్లోబల్ సీటీగా అభివృద్ధి చెందడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ ఎఫ్ 21 వింగ్స్ తయారీ హైదరాబాద్‌లో చేపట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీలలో హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా ఉండటం హైదరాబాదీలకే కాదు మొత్తం తెలంగాణకే తలమానికమన్నారు కేటీఆర్. వెయ్యికి పైగా ఏరోస్పేస్ కాంపోనెంట్ పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు కేటీఆర్. అమెరికా మరియు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ కు…
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో తయారు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హారీష్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ పరికరాలు సామాన్యుల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామని తెలిపారు. నిమ్స్‌లో 155 ICU బెడ్స్ అందుబాటులో…
ఈటల రాజేందర్ భూముల వ్యవహరం పై కలెక్టర్ నిన్న నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే కాగా ఈ నివేదిక పై ఈటల రాజేందర్ భార్య జమున అసహనం వ్యక్తం చేసింది. కలెక్టర్‌ను కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలంటూ విమర్శించారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ మాటల దాడికిదిగారు. బీజేపీ, ఈటలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఈటల తప్పు…
ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాగడం రోడ్డు ఎక్కడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది. దీని ఫలితంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నగరంలో మితిమీరి పోతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు. నిన్న ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి.…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ రోజు కూడా దాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా లోక్‌సభ, రాజ్యసభలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న ఎంపీలు.. ఇవాళ సమావేశాలను బహిష్కరించనున్నారు.. Read Also: ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. ఇప్పటికే అప్రమత్తమైన చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.. ముఖ్యంగా విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు.. ఇక, భారత్ కూడా విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు, ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ముఖ్యంగా 11 హై రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు తప్పనిసరి చేసింది.. కొత్త వేరియంట్‌తో అలెర్ట్ అయిన తెలంగాణ సర్కార్.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో…
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా పడతారో తెలియడం లేదు. వరుస దొంగతనాల కేసులతో పోలీసులు సతమతమవుతున్నారు. తాజాగా..హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో దొంగలు తమ చేతివాటం చూపెట్టారు. ఏకంగా అయ్యప్ప స్వాములకే పంగ నామాలు పెట్టారు దొంగలు. స్వాముల తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ దర్గా ఖలీజ్ ఖాన్ లో అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న స్వాముల బ్యాగ్‌లో ఉన్న రూ.30 వేల నగదు, ఓ బైకును దుండగులు దొంగిలించారు. అర్ధరాత్రి…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా.. బంగారం ధరలు పెరుగుతుండటంతో… పుత్తడిని కొనుగోలు చేయాలంటే… ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,760 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
కరోనా మహమ్మారి కారణంగా ఆన్లైన్ యాప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఎడ్యుకేషన్, ఫుడ్, న్యూస్, ఎంటర్టైన్మెంట్.. ఇలా రంగాల యాప్‌లతో పాటు వీడియో డేటింగ్ యాప్‌లకు కూడా గిరాకీ ఏర్పడింది. వీడియో డేటింగ్లు చేసుకుంటున్న నగరాలలో చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. డేటింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు డేటింగ్ జపం చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఏ పని కావాలన్నా…