హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నేరాలు ఘోరాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా శేరిలింగంపల్లి సమీపంలోని తెల్లాపూర్ లో దారుణం జరిగింది. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి కనపడకుండా పోయిన కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు.
రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కడవత్ రాజు బంధువుల్ని విచారిస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమల తండాకు కు చెందిన కడవత్ రాజు హత్యకు గురికావడంతో ఈ హత్య ఎవరు చేసి వుంటారోనని పోలీసులు విచారణ జరుపుతున్నారు
బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 25 న మిస్సింగ్ కేస్ నమోదు అయింది. ఇవాళ కుకునూర్ గ్రామం, రాయ్ కోడ్ పి యస్ లో రాజు హత్యకు గురయ్యాడు. కడవత్ రాజు శరీరం నుంచి తల మొండెం వేర్వేరు చోట్ల లభ్యం కావడంతో విచారణ ఆలస్యం అవుతోంది.
కడవత్ రాజు 24వ తారీఖున మిస్ అయినట్టు కేసు నమోదయింది. 25న ఎఫ్ ఐ ఆర్ నమోదుచేశారు పోలీసులు. పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు వున్నట్టు తెలుస్తోంది. రాయికోడ్ మండలం కుస్నూర్ గ్రామ శివారులో తల లభించింది. న్యాల్ కల్ మండలం రాఘపూర్ గ్రామ శివారులోని మంజీరా బ్రిడ్జ్ పరిసరాల్లో మొండెం ను పడేసి వెళ్ళారు గుర్తుతెలియని దుండగులు.రియల్ ఎస్టేట్ లావాదేవీలలో జరిగిన ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.