శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమంలో భాగంగా శనివారం 108 దివ్యదేశ మూర్తుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. వేలాదిమంది వీక్షించి తరించారు. ఈ విశిష్ట కార్యక్రమం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అద్భుతంగా వివరించారు. భగవంతుడు అనేక రూపాలలో అవతరిస్తూ సంచరిస్తుంటాడు. ఆలయాల్లో, ధ్యానం చేసేవారి మనసులలో భగవంతుడు కొలువై వుంటాడు. విగ్రహ రూపంలో ఆలయాల్లో వుండే రూపం మనకు కనిపిస్తుంది. అవతరాల్లో వుండే రూపం ఆయా కాలాల్లో కనిపిస్తుంది. వైకుంఠం అనేది గ్రంథాల్లో వింటాం కానీ ఈ దేహాల్లో అది మనకు కనిపించదు.