సోషల్ మీడియా వచ్చాకా మంచి ఎంత జరుగుతుందో దానికి మించిన చెడు కూడా జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. చిన్న పిల్లల దగ్గరనుంచి.. రేపో మాపో చనిపోయేవారు కూడా ఫోన్, సోషల్ మీడియాలో అకౌంట్ లేకుండా ఉండడంలేదు. ఇక కామాంధుల సంగతి సరేసరి.. ఎక్కడ అమ్మాయి దొరుకుతుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు.. కొంచెం గ్యాప్ దొరికినా కూడా వారికి మాయమాటలు చెప్పి వలలో వేసుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడతారు.. అయితే ఇలాంటి పనులు…
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా.? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి వరసగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో గరిష్ట రోజూవారీ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం దేశంలో 3000కు లోపలే కరోనా కేసులు ఉంటే.. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 7 వేలను దాటింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు…
టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహణకు సిద్ధం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 12వ తేదీన టెట్ నిర్వహించనున్నారు.. అదే రోజు ఆర్ఆర్బీ పరీక్ష ఉండడంతో టెట్ వాయిదా వేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే, టెట్ అనుకున్న ప్రకారం 12వ తేదీన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది సర్కార్.. ఆదివారం రోజు టెట్ నిర్వహించనుండడంతో.. డైరెక్టర్, SCERT మరియు కన్వీనర్ TS-TET-2022 కీలక ప్రకటన చేశారు. మొత్తం 33 జిల్లాల్లో రెండు సెషన్లలో టెట్ జరుగుతుంది..…
రోజురోజుకు సమాజంలో ఆడపిల్ల పుట్టాలి అంటేనే భయపడేలా చేస్తున్నారు కొందరు మృగాళ్లు.. ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఎక్కడో ఒకచోట ఆడపిల్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు.. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ పబ్ లో మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువకముందే మరో ఘటన వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఇద్దరు…
శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కరాటే కల్యాణి. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన హిందూ సంఘం ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. ఇలాంటి వారిపై హిందువులంతా ఏకమై న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 100 కోట్ల మంది హిందువుల దైవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు…
ప్రజల ప్రాణాలు, మానాలు, ఆస్తులు రక్షించలేని కేసీఆర్కి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపై స్పందించిన ఈటల.. ఆర్.కె.పురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్లో తొమ్మిదేళ్ల అమ్మాయిపై లైంగిక దాడులు జరిగాయి. స్థానిక కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీరాములు, స్థానిక నాయకులు అందరూ బస్తీని సందర్శించి ప్రజలకు భరోసా ఇచ్చి.. కుటుంబాన్ని…
తగ్గినట్టే తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కోవిడ్ రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ పైకి కదులుతోంది. అయితే, కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రెగ్యులర్ ఫ్లూస్తో లక్షణాలతో పాటు జ్వరం, తలనొప్పి, స్మెల్ లేకపోవడం ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేసింది.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం…
మీర్పేట్ రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్పేట్లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్కి అడ్డుపడ్డారు. దీంతో మీర్పేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్పేట్ స్టేషన్కు తరలించారు.…
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రయాణికుల బస్పాస్లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో ప్రయాణికులపై అశనిపాతమే అయింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్లైన్ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు, ఉద్యోగాలకు వెలుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్పాస్ చార్జీలు గ్రేటర్లోని లక్షలాది మంది ప్రయాణికులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల…
బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సంజయ్.. జూన్ 2న ‘‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’’ను జిట్టా నిర్వహించారని తెలిపారు. కేసీఆర్ ను కించపరిచే విధంగా ఆ సభలో స్కిట్ వేయించారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై జిట్టాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిట్టాను పోలీసులు అర్దరాత్రి అదుపులోకి తీసుకోవడంపై సంజయ్…