Hyderabad Crime: దారుణం.. పార్టీలో ఆసుపత్రి సిబ్బంది.. వైద్యం అందక శిశువు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలోని చాదర్ ఘాట్ లో ఓప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు వదిలిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే హస్పట్ బిల్డింగ్ పై ఓ వివాహానికి ముందస్తు పార్టీ వేడుకల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. డీజేతో పాటలకు స్టెప్పులు వేస్తూ వేడుకలు చేసుకుంటున్న సందర్బంలో ప్రసవం కోసం వచ్చిన గర్భవతిని వైద్యులు పట్టించుకోలేదు. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. అయినా వైద్యలు పట్టించుకోకుండా పార్టీలో మునిగిపోయారు. అయితే గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో.. శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈఘటన పాతబస్తీలో జరిగింది.
కాగా.. చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గానా బజానా, బాణాసంచాలో సిబ్బంది హంగామా చేపట్టారు. రానున్న మాసంలో డాక్టర్ కూతురు వివాహం ఉండటంతో ముందస్తుగానే ఆసుపత్రి బిల్డింగ్‌పై పార్టీని ఏర్పాటు చేశారు. డీజేలో పాటలుపెట్టుకుని ఓరేంజ్ లో డ్యాన్స్‌లు చేస్తూ సిబ్బంది మునిగిపోయారు. అయితే ఆ సమయంలోనే ఓ గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో వచ్చింది. ఆ గర్భిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపినా వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది స్పందించక పోవడం గమనార్హం. డీజే పార్టీలో లీనమై ఎంజాయ్ చేస్తూనే వుండిపోయారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
అయితే ఈ క్రమంలో గర్భణి తీవ్ర నరకయాతన అనుభవించింది. కానీ శిశువు గర్భంలోనే మృతి చెందింది. కాగా.. గర్భిని ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు విశ్వనీయ సమాాచారం. కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. స్థానిక సమాచారంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. పోస్టుమార్టం కోసం మృతి చెందిన శిశువు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రోగులను పట్టించుకోకుండా పార్టీలో నిమగ్నమైన సదరు ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Presidential polls 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!