బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్ వద్ద నిరసనకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. దీనిలో భాగంగా జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా మందస్తుగా బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు చుట్టుముట్టి బండి సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.…
జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో కస్టడీ విచారణ లో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించిన ఏ 1 నిందితుడు సాదుద్దీన్, మొదటిరోజు 6 గంటలు పాటు పోలీసులు విచారణ చేసారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణలో వెల్లడించిన స్టేట్మెంట్ నేడు కీలకంగా మారనుంది. మే 28న ఘటన జరిగిన అనంతరం ఆ మరుసటి రోజు ఏం జరిగిందన్న దానిపై పోలీసుల అరా తీస్తున్నారు. సాదుద్దీన్ విచారణలో వెల్లడి: మే 28 న అనుమానం వచ్చి అదే రోజు రాత్రి…
రాష్ట్రంలో శాంతి భద్రతలపై అఖిల పక్షంతో చర్చిద్దాం అని సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని.. తెలంగాణను కాపాడుకోవడానికి ఎలాంటి శశబిషలు లేకుండా ప్రగతి భవన్ కు స్వయంగా నేనే వస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో పబ్, క్లబ్, డ్రగ్స్ వాడకం తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, తమ…
జూబ్లీహిల్స్ అమ్మాయి అత్యాచారం కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నిందితులను విచారిస్తున్నారు. గురువారం కేసులో కీలకంగా ఉన్న మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు విచారించారు. దాదాపుగా 5 గంటలు పాటు విచారణ కొనసాగింది. ఫోన్ సీడీఆర్ డేటా, సీసీ కెమెరా ఫులేజ్ ను ముందుపెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాదుద్దీన్ మాలిక్ కు మైనర్లతో ఉన్న పరిచయాలు, సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులే కాకుండా ఇతర వ్యక్తుల…
హైదరాబాద్ కు చెందిన టెక్ పవర్డ్ కన్ స్ట్రక్షణ్ అగ్రిగేటర్ ఇటీవల వీహైజ్ బ్రాండ్ గా చేయబడింది. హోకోమోకో మొదటి ఫండింగ్ రౌండ్ లో యాంథిల్ వెంచర్స్, ఏంజెల్ ఇన్వెస్టర్ల గ్రూప్ నుంచి వన్ మిలియన్ యూఎస్ డాలర్లను సేకరించింది. టెక్నాలజీని అప్ గ్రేడ్ చేయడంతో పాటు భారత్ లోని ఇతర నగరాలకు విస్తరించడంలో ఈ నిధులను ఉపయోగించనుంది. వీహౌజ్ టెక్ అగ్రిగేటర్ ప్లాట్ ఫామ్. ఇది ఎండ్ టూ ఎండ్ నిర్మాణ సేవలను సులభతరం చేస్తుంది.…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు ఏ-1 సాదుద్దీన్‌ను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉన్నందున సాదుద్దీన్ మాలిక్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం 4 రోజులు అనుమతిచ్చింది. సాదుద్దీన్‌ను జూబ్లీహిల్స్ పీఎస్‌లోని ప్రత్యేక గదిలో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. Jubilee hills Case: జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసుల సంచలన నిర్ణయం అత్యాచారానికి సహకరించిన ఇతర నిందితుల…
జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేప్ కేసు నిందితులను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత ట్రయల్ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిపై జువైనల్ జస్టిస్‌దే తుది నిర్ణయం కానుంది. Jubilee hills Case: NTV చేతిలో బాధితురాలి రెండో స్టేట్మెంట్.. సంచలన విషయాలు మైనర్ల మానసిక స్థితి,…
జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల విచారణ జరుగుతోంది. బాధితురాలి రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇంటిదగ్గర దింపుతామని బాధితురాలిని ట్రాప్ చేసి మరీ అత్యాచారం చేసినట్లు తెలిసింది. నిందితులే తనను బలవంతం చేశారని బాధితురాలి రెండోసారి స్టేట్మెంట్లో వెల్లడైంది. పబ్ నుండి బయటికి వచ్చిన తన స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిందని బాధితురాలు తెలిపింది. తనను పబ్‌కి తీసుకొచ్చిన స్నేహితుడు పబ్ లోపలే ఉన్నాడని, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్…
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ లోన్ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పోలీసులు దాడులతో కొన్నాళ్ల పాటు ఆగిన వేధింపులు మళ్లీ షురూ అయ్యాయి. ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. కేవలం మీ ఆధార్ పాన్ కార్డ్ వుంటే చాలంటూ అమాయకులకు ఎరవేస్తున్నారు. వారిఎరలో పడ్డవారికి వేధింపులకు గురిచేస్తున్నారు. యాప్‌ల ద్వారా లోన్లు తీసుకున్న వారికి ఫోన్లు చేస్తూ వేధిస్తున్న నిర్వాహకులు.. అంతటితో ఆగకుండా వారి స్నేహితులు, బంధువులకు సైతం ఫోన్లు చేసి పరువు తీస్తున్నారు. వారి ఫోటోలపై,…
రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు ఘటన మరువకముందే మరో ఉందతం వెలుగులోకి వచ్చింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి , ఆ యువతిని తనపై నమ్మకం కుదిరేలా చేసుకుని, తనపై వున్న కామవాంఛ తీర్చకున్నాడు. ఆయువతిని గర్భవతిని చేసి చేతులు దులుపుకోవాలని చూసాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ కిషన్ బాగ్ లో జరిగింది. తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి…