తెలంగాణలోకి బుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.. మొన్న రాత్రి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవగా.. మంగళవారం పరిస్థితి భిన్నంగా ఉంది.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగిపోయాయి.. అయితే, రాత్రి నుంచి మళ్లీ పరిస్థితి మారిపోయింది.. అక్కడక్క వర్షం కురిసింది.. మరోవైపు, ఇక నుంచి వర్షాలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు…
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ నెల 16 న (గురువారం) శంషాబాద్ సమీపంలోని (ముచ్చింతల్ రోడ్) గొల్లూరు ఫారెస్ట్ పార్క్ లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది. పుడమిని రక్షించుకుందాం, నేల తల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందాం అంటూ సేవ్ సాయిల్…
నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన చేసేది విలన్ క్యారెక్టర్స్ అయినా మనసు మాత్రం ఎంతో మంచిది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో సోనూసూద్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఎందరికో సహాయం అందించి మన్ననలు అందుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలాంటి సాయం అడిగినా అడుగు ముందుకేసి చేసేస్తుంటాడు. తాజాగా సోనూసూద్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక…
వాహనాలపై నెంబర్ ప్లేట్లు చూస్తుంటాము. నెంబర్ ప్లేట్ తో సహా తల్లిదండ్రులు వారి పిల్లల పేర్ల రాసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల పేర్లు రాసుకుంటుంటారు. నెంబర్ ప్లేట్ అంటే కొందరు లక్కీ నెంబర్ తీసుకోవడం మనం చూస్తుంటాము. ఆవాహనాలను చాలా ఇష్టంగా చూసుకుంటాం. అంతే కాదు మనకు నచ్చిన హీరో హీరో యిన్లు పేర్లు.. ఫోటోలు కూడా దర్శనమిస్తుంటాయి. కానీ ఓప్రబుద్ధుడు తన బైక్ పై ఓ పేరును రాసుకున్నాడు. అంతే కాదు అతను నా ప్రెండ్ అంటూ…
తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మొన్న మోడీ.. నిన్న అమిత్ షా.. నేడు తరుణ్‌చుగ్ రానుండటంతో.. తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టిందనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ May 26న హైదరాబాద్ లో రెండున్నర గంటల పాటు రాష్ట్ర రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే.. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాగా.. JUNE 02న అమిత్ రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన…
నగరంలోని మెహదీపట్నంలో యువకులు వీరంగం సృష్టించారు. సోమవారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు ఆసిఫ్‌నగర్‌లో హల్చల్ చేశారు. పోలీసు వాహనం పైకి ఎక్కి ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలపై దాడిచేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. జిర్రా సమీపంలోని రాయల్స్ హోటల్ వద్ద గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై…
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని…
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో కొట్టుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వంటే నువ్వేనంటూ ఐదుగురు మైనర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బాలికను ట్రాప్ చేద్దామని నువ్వే అన్నావని కార్పొరేటర్ కుమారుడు టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. అతణ్ని టార్గెట్ చేసుకుని మిగిలిన నలుగురు దాడి చేశారు. అతను తిరగబడి…
రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయం మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ…
తెలుగు సినీ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో సోమవారం (జూన్ 13న) హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో మధ్యాహ్నం 3.30కి కీలక సమావేశం జరుగబోతోంది. దీనికి సంబంధించి నిర్మాతల మండలి కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలోని నిర్మాతలు, నిర్మాణంలో ఉన్న, నిర్మించబోతున్న నిర్మాతల సభ్యులకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపారు. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వర్కర్స్ వేతనాల పెంపుదలతో…