పోర్న్ వెబ్ సైట్లు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు వెళ్లేవారు. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూసేవారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగిన తర్వాత నెట్కేఫ్లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం స్టార్ట్ అయ్యింది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అది ఇతరులకు తెలిస్తే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. స్పార్ట్‌ఫోన్ యుగం…
ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభమైంది. కృత్తిక, రోహిణి కార్తెల్లో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆనవాయితీగ మన పూర్వీకుల కాలం నుంచే వస్తోంది. మృగశిర కార్తె ఇవాల్టి నుంచి మొదలై 15 రోజుల పాటు ఉంటుంది. ఐతే మృగశిర కార్తె తొలి…
నగరం మధ్యలో ‘అమీబా’ ఆకారంలో ఉండే సాగర్ పర్యాటకం పరంగా అత్యంత ఆహ్లాదమైన ప్రదేశం. సరస్సు మ ధ్యలో ప్రపంచలోనే అతి పొడవైన బుద్దు డి విగ్రహం ఒక అ పురూపమైన అద్భుత దృశ్యం. దీన్ని న్యూయార్క్ లోని ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తరహాలో ఏర్పాటు చేశారు. దీనిని వీక్షించేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు చుట్టూ లూప్ రూపంలో ఒక సమగ్రమైన రోప్ నెట్ వర్క్ ను ఏర్పాటు…
హైదరాబాద్ నగరంలో సంచనలం రేపిన జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో లోతుగా దర్యాప్తు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒక్కరే మేజర్ అని తెలిపారు. కేసులో ఐదుగురు మైనర్లు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేర్లు వెల్లడించడం లేదన్నారు. వారందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు. అయితే ఆరో వ్యక్తి బాధితురాలిపై రేప్ చేయలేదన్నారు. రేప్ చేసిన నిందితులకు 20 ఏళ్ల…
ఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఒక్కో కార్పొరేటర్ ను పరిచయం చేసుకున్నారు ప్రధాని. 47 మంది కార్పొరేటర్లు తెలంగాణ ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని సూచించారు మోదీ. వచ్చే ఎన్నికల కోసం బాగా పని చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఒక్కో కార్పొరేటర్ తో మాట్లాడుతూ.. వారి కుటుంబ పరిస్థితి, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. కార్పొరేటర్లుగా పనితీరు ఎలా ఉందని…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. గత కొన్ని రోజులుగా సల్మాన్ ను చంపేస్తామంటూ ముంబై గ్యాంగ్ స్టార్ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో సల్లు భాయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాల్లో సగభాగం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఈ హీరో కొత్త సినిమా ‘కబీ ఈద్ కబీ దివాళి’ షూటింగ్ రామోజీ…
వాడు భర్త కాదు.. నరరూప రాక్షసుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మొదటి భార్యను హీటర్‌తో కొట్టి చంపాడు. ఆ కేసులో జైలుకెళ్లి, బెయిల్‌పై బయటకొచ్చాడు. అనంతరం మరో యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆ దుర్మార్గుడు.. తొమ్మిది నెలలు తిరక్కముందే డంబెల్‌తో బాది చంపేశాడు. ఈ దారుణ ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడలోని ఓ మాల్లో పని చేసే సరోజ (21)కు…
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అత్యాచారం ఆలోచనే రానివ్వకుండా నిందితులకు శిక్షలు విధించాల్సిన అవసరముందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, పాతబస్తీ అభాగ్యురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో ఏపీలో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.…
ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా జనం ఉక్కపోత నుంచి ఊరట పొందారు. భాగ్యనంగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్మెట్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో జల్లులు కురుసాయి. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురువగా.. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇదిలా…