బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ నేడు నగరానికి రానున్నారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ నగరం అంతా కషాయి జండాలతో రెపలాడుతున్నాయి. మోడీ ని ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వస్తున్న ప్రధానిమోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి తలసాని.. ఇప్పటివరకు ప్రధానికి రెండుసార్లు స్వాగతం పలికారు.
ప్రధాని షెడ్యూల్ ఇదే..
ప్రధాని మోదీ నేడు మధ్యాహ్నం 2 గంటల 55 నిమిసాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ సమావేశం చర్చించిన తరువాత రాత్రి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు ప్రధాని. మొత్తం 288 గదులున్న ఈ హోటల్‌లో ప్రధాని బస కోసం ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వు చేసారని, బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్ మొత్తాన్ని బుక్ చేశారని హోటల్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు
అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు. కాగా.. రాజ్‌భవన్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్‌ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారుతాయని నిఘా వర్గాలు తెలిపారు. దీంతో.. ఎస్పీజీ సూచన మేరకు నోవాటెల్‌లోనే ప్రధాని బసను ఖరారు చేసినట్టు తెలిసింది. అయితే.. 2004వ సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన అప్పటి ప్రధాని వాజ్‌పేయి లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతం లోని ఓ స్టార్ హోటల్‌లో బస చేశారు.
Earthquake: ఇరాన్, చైనాలో భూకంపం..6.0 తీవ్రతతో కంపించిన భూమి