* నేటి నుంచి హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్శ సమావేశాలు, హెచ్‌ఐసీసీలో రెండు రోజుల పాటు సమావేశాలు, తరలివచ్చిన బీజేపీ నేతలు
* నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యాహ్నం 2.55కి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని, ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.20కి హెచ్‌ఐసీసీకి మోడీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్న మోడీ,
* హైదరాబాద్: నేడు పాతబస్తీకి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, మధ్యాహ్నం 12.30కి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న యోగి
* నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు యశ్వంత్ సిన్హా, రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌కు యశ్వంత్ సిన్హా, స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్, అనంతరం, కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ, మధ్యాహ్నం 3.30కి ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సమావేశం
* నేడు రెండో రోజు ఉత్తరాంధ్రలో మంత్రులు ఆర్కే రోజా, మెరుగు నాగార్జున పర్యటన, సంక్షేమ హాస్టళ్ల పనితీరును సమీక్షించనున్న మంత్రి నాగార్జున
* ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వాపక్షాల నిరసన కార్యక్రమాలు
* నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం..పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
* కాకినాడ: నేడు తుని తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి రాజా
* గుంటూరు: కొలకలూరు గ్రామంలో డయేరియా ప్రబలిన ప్రాంతాలలో పర్యటించనున్న ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
* చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం నెలవాయి పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* నేడు ఐఐటీ హైదరాబాద్ ను సందర్శించనున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, ఉదయం 10.30 గంటలకు IIT హైదరాబాద్ లోని BVR సియంట్ భవనానికి శంకుస్థాపన, 11 గంటలకు టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ అండ్ రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ లను ప్రారంభించనున్న ధర్మేంద్రప్రధాన్