జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ లో నిర్వహించబోయే జాతీయ మహాసభలకు దేశంలోని ముఖ్యమంత్రులు వస్తారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. 16 రాష్ట్రాల తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం తొలిసారి అని వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా బీజేపీ సమావేశాలు జరగనివ్వకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజారి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ సమావేశాలకు ప్రచారం రాకూడదని రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా.. సరే సమావేశాలు విజయవంతం చేసి తీరుతామని చెప్పారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభిమానులను సభకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రైలు నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న నియోజకవర్గాల నుంచి, సుమారు 25 రైళ్లలో 50 వేల మందిని సభకు తర లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా.. బీజేపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ప్రదీప్‌కుమార్ ఈ వివరాలు వెల్లడిం చారు. పలు జిల్లాల నుంచి వచ్చేవారు శివార్లలో వాహనాలు పార్క్ చేసి.. మెట్రో రైళ్లలో సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, మోదీ సభకు తరలిరావాలని కోరుతూ సుమారు 10 లక్షల ఆహ్వాన పత్రికలను రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించాయి. అంతేకాకుండా.. వర్షం వచ్చినా ఆటంకం లేకుండా, ప్రధాని బహిరంగసభలో వర్షం కురిసినా జనానికి ఇబ్బంది లేకుండా అధునాతన టెక్నాలజీతో కూడిన జర్మన్ హ్యాంగర్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నవిషయం తెలిసిందే..
https://www.youtube.com/watch?v=p43oafUZUaI