రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్ 13.28 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో 12.75, భద్రాది కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 11.13 వర్షపాతం నమోదైంది. జయశంకర్ జిల్లా…
రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన నిరసన, ఆందోళనలు,, ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను…
పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అక్రమ బంగారం తరలింపికు అడ్డుకట్ట పడటం లేదు. అనుమానితులను అదుపులో తీసుకుని బంగారం సీజ్ చేస్తున్న యదేచ్ఛగా అక్రమ బంగారాన్ని తరలించడాన్ని ప్లాన్ వేస్తున్నారు. ప్రయాణికులకు సోదాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు పంపిస్తున్న మిగతావారిలో ఆభయం కనిపించడం లేదు. ఈ వార్తలను మామూలు విషయంగానే తీసుకుంటూ బంగాారాన్ని తరలించే పనిలో పడుతున్నారు. కాగా ఈరోజు శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కువైట్ నుండి హైదరాబాద్ కు…
* మరోసారి రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని పేర్కొన్న ఈడీ, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే వరుసగా మూడు రోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు. * నేడు చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ పిలుపు, సోమాజిగూడ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతల ర్యాలీ * అనకాపల్లి జిల్లాలో రెండు రోజు చంద్రబాబు పర్యటన, అనకాపల్లిలో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకలాపాలపై సమీక్ష *…
హైదరాబాద్ లో మరోసారి భారీగా కురుస్తోంది వర్షం. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. నాంపల్లి, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్, అంబర్పేట్, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. రుతుపవనాల ప్రవేశంతో బుధవారం నాడు…
ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అని సూచించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతిభకు ఆకాశమే హద్దు.. వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.. 3 నెలలు ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు…
తెలంగాణలో వరుసగా జరుగుతోన్న ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ హరగోపాల్.. చదువుకుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటుంటే… టీచర్లుగా మా కర్తవ్యం మేం చేస్తున్నామా అనే డౌట్ వచ్చిందన్నారు. ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయకుండా.. నేరం చేస్తుందని దుయ్యబట్టిన ఆయన.. రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నాం అనేది చూసుకోవాలని సూచించారు. నగరంలో జరుగుతున్న ఘటనలు… అధికార పార్టీ తీరు మాకు కొంత విషాదకరంగా ఉందన్న హరగోపాల్.. తెలంగాణ వస్తే మెరుగైన సమాజం వస్తుంది…
హైదరాబాద్‌లోని బేగంపేటలో మందుబాబులు హల్చల్ చేశారు. మంగళవారం రాత్రి బేగంపేట మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వచ్చిన ముగ్గురిని పోలీసులు ఆపారు. అప్పటికే మందుకొట్టి ఉన్న ముగ్గురు పోలీసులతో గొడవకు దిగారు. డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో వాహనాన్ని ఆపిన పోలీసులతో ఆ వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు. మమ్మల్నే ఆపుతారా.. అంటూ మరింత రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ట్రాఫిక్ ఎస్సైపై దాడిచేశారు. ఈ…
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను గుర్తించి, 7 మందిని విచారించారు పోలీసులు.. మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్ కారును మైనర్ నడిపినట్లు గుర్తించారు. బెంజ్ కారు యజమానిపై కేసు నమోదు moFeki జూబ్లీహిల్స్ పోలీసులు.. అత్యాచారం జరిగిన ఇనోవా వాహనం వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్ కారుగా తేల్చారు. డ్రైవర్‌తో పాటు ఇనోవా కారు…
సైబర్ నేరస్థులు పంథా మార్చి ప్రజలను వంచిస్తున్నారు. మెట్రోనగరాలతో పాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి ఫోన్ నంబర్లు తెలుసుకుని వారిని తమ వాట్సాప్ బృందాల్లోకి చేర్చుకుంటున్నారు. లక్షల్లో లాభాలొస్తాయని నమ్మిస్తున్న అక్రమార్కులు వాటిని బాధితులు తీసుకున్నాక లక్షలు కొల్లగొడుతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ అడ్వొకేట్‌తో పాటు మరో వ్యక్తిని మోసం చేసి రూ.65 లక్షలు కాజేశారు. హైదరాబాద్ వారసిగూడ చెందిన ఓ అడ్వొకేట్‌ను సైబర్ చీటర్స్ వాట్సప్…