నేడు నగరానికి వీఐపీలు పర్యటించనున్న సందర్భంగా.. హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. వచ్చిన ప్రముఖులకు ఇబ్బందులు కలుగకుండా ఇవాళ, రేపు పలుచోట్ల వాహనాలను దారి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నగరానికి చేరుకున్న వీఐపీలు ప్రయాణించే ప్రధాన రోడ్డు మార్గాలైన మాదాపూర్, శంషాబాద్, ఖైరతాబాద్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. అయితే.. నేడు బీజేపీ జాతీయ మహా సభల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ లు హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇవాళ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సైతం నేడు హైదరాబాద్ లో పర్యటించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్వాగతం పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. రెండు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
read also: TDP: అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ ప్రకటన హల్‌చల్.. టీడీపీ క్లారిటీ
బమింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రోటరీ వైపునుకు అనుమతించరు. కాగా.. ఆ వాహనాలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్ వైపునకు మళ్లిస్తారు. అయితే.. పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు బేగంపేట విమానాశ్రయం నుంచి పంజాగుట్ట, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబరు 36, మాదాపూర్ మీదుగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య హెచ్‌ఐసీసీ నోవాటెల్, మాదాపూర్‌కు తరలివెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండొచ్చు. కావున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని.. తమకు సహకరించాలని పోలీసులు సూచించారు.