బీజేపీ బహిరంగకు సుమారు 10లక్షల మందికి పైగా జనసమీకరణ, మరోవైపు దేశ ప్రధాని హాజరవనున్న సభ. అయితే బీజేపీ నేడు నిర్వహించదల్చిన భారీ బహిరంగ సభకు వాన టెన్షన్ పట్టుకుంది. కాగా. నిన్నటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భాజపా శ్రేణులు భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టారు. అయితే సభలకు ముందువరకు సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడంతో గురువారం నుంచి…
ఈరోజు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఈ సభకు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికార సాధనే లక్ష్యమంటోన్న బీజేపీ ఇవాళ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నేడు సాయంత్రం 6 గంటలకు జరగబోచే విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభ సందర్భంగా జంట నగరాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు వెయ్యి ఆర్టీసీ బస్సులను బీజేపీ బుక్ చేసుకోవడం..జిల్లాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉండటంతో…
తెలంగాణ వచ్చి ఇప్పటికి 8 ఏళ్లయింది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేదా అని ప్రశ్న ఇవాళ తలెత్తుతోంది. దీనికి కారణం ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. దీనికీ దానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా?. అదే మనం ఇప్పుడు చర్చించుకోబోయే అంశం. 18 ఏళ్ల కిందట కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగాయి. అప్పుడేమో…
నగరంలో.. టీఆర్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ మహాసభ నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, నిర్వహించబోయే ర్యాలీలకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.…