అందరి చూపు ఇప్పుడు హైదరాబాద్ పైనే ఉంది.. భారతీయ జనతా పార్టీ బడా నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.. కాసేపట్లో హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, కీలక నేతలు నగరానికి చేరుకుంటున్నారు.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా.. తదితరులు రానుండా.. ఇక, ప్రధాని నరేంద్ర…
నేడు నగరానికి వీఐపీలు పర్యటించనున్న సందర్భంగా.. హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. వచ్చిన ప్రముఖులకు ఇబ్బందులు కలుగకుండా ఇవాళ, రేపు పలుచోట్ల వాహనాలను దారి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నగరానికి చేరుకున్న వీఐపీలు ప్రయాణించే ప్రధాన రోడ్డు మార్గాలైన మాదాపూర్, శంషాబాద్, ఖైరతాబాద్‌లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. అయితే.. నేడు బీజేపీ జాతీయ మహా సభల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ లు హైదరాబాద్…
నేడు భాగ్యనగరానికి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు యశ్వంత్ సిన్హా చేరుకుంటారు. సిన్హాకు స్వాగతం పలికేందుకు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అనంతరం బేగం పేట్ నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. అనంతరం 3.30 గంటలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ నేడు నగరానికి రానున్నారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ నగరం అంతా కషాయి జండాలతో రెపలాడుతున్నాయి. మోడీ ని ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వస్తున్న ప్రధానిమోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు సీఎస్…
ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోర్డింగుల వార్ నడుస్తోంది. మోడీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీవాళ్లు క్రియేటివ్‌గా హోర్డింగులను ఏర్పాటుచేస్తున్నారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ అని రాసి ఉన్న బ్యానర్లను, హోర్డింగ్‌లు ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేశాయి.. ఇది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. అయితే,…
క్రమంగా పెరిగిపోతున్న పెట్రో ధరలతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు.. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.. ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు సైతం హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి.. అయితే, వాటిని సదరు వినియోగదారుడు ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది.. బయటకు వెళ్లే ఛార్జింగ్ సెంటర్లు పెద్దగా అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు.. దీంతో ఎలక్ట్రిక్ వాహనదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎక్కడికి వెళ్లినా.. ఛార్జింగ్ కిట్‌ను వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు.. అంటే,…
ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు.. 4 అంచల భద్రత ఏర్పాటు చేశారు.. వీఐపీ సెక్యూరిటీ, అప్పర్, లోయర్, మిడిల్ ఇలా ప్రధాని మోడీ చుట్టూ ఎస్పీజీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి..
జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే.లక్ష్మణ్, ఇతర బీజేపీ నేతలు పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ లో నిర్వహించబోయే జాతీయ మహాసభలకు దేశంలోని ముఖ్యమంత్రులు వస్తారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. 16 రాష్ట్రాల తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం తొలిసారి అని వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా బీజేపీ సమావేశాలు జరగనివ్వకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధికార…