దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఇలాంటి ఘటనలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపుల నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే కొన్ని కేసుల విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్షలు కూడా ఖరారు చేశారు. అవన్ని పక్కనపెట్టి వారి పని వారుచేసుకుపోతున్నారు దుండగలు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ సంతోష్ నగర్ లో మొయిన్ బాగ్ లోని ఓప్రైవేట్ స్కూల్ లో చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ కుమారుడే స్కూల్ పిల్లలపై అమానుషంగా ప్రవర్తించాడు. పిల్లలపై న్యూడ్ వీడియోలను చిత్రీకరించాడు. వారి బ్లాక్ మైల్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నగరంలోని మొయిన్ బాగ్ లోని ఓప్రైవేట్ స్కూల్ లోనే స్కూల్ లోనే నిందితుడి కుటుంబం నివాసం వుంటోంది. ఇదే ఆసరాగా తీసుకున్న కుమారు యాసర్ స్కూల్ పిల్లలను వేధించటం మొదలుపెట్టాడు. వారిపై న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడేవాడు. తల్లి ప్రిన్సిపాల్ కావడంతో.. ఎవరికి భయపడేవాడు కాదు. స్కూల్ పిల్లలను బెదిరించి లైంగిక దాడికి పాల్పడేవాడు. గత కొంతకాలంగా చాలా మంది చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. అయితే ఓ చిన్నారి వారి కుటుంబసభ్యులకు విషయం తెలుపడంతో.. ఈవిషయం కాస్త వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రిన్సిపల్ కుమారుడు యాసర్ ను అదుపులోతీసుకుని అతనిపై సెక్షన్ 354(a), 509, 9(m) r/w pocso act 2012 కింద కేసులు నమోదు చేసారు. అతనివద్దనుంచి పలు న్యూడ్ సెల్ఫీ వీడియోస్ స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా చాలామంది స్కూల్ చిన్నారుల పట్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.