విద్యాశాఖా మంత్రి సబితపై వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈనేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారని అన్నారు. స్వయంగా నేను ఆయన్ను కలిసి మాట్లాడుతా అంటూ పేర్కొన్నారు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు అంటూ…
భూసమస్యల పరిష్కారంపై మరోసారి దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం.. వాటి పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కె. చంద్రశేఖర్ రావు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తన సొంత నియోజకవర్గం మహేశ్వరంలో వరుస తలనొప్పులు తప్పడంలేదు.. తాజాగా, టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
మూఢనమ్మకాల మాయలో పడి ప్రజలు నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు. వాళ్లను నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకుని డబ్బులు దోచుకుంటున్నారు నకిలీ బాబాలు.. ఇలాంటి ఫేక్ బాబాలను రాచకొండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. అంతర్ రాష్ట్ర నకిలీ బాబా ముఠాను అరెస్ట్ చేసామని తెలిపారు. భువనగిరి ఎస్వోటీ, భువనగిరి టౌన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో ముఠాను అరెస్ట్…
సాఫ్ట్వేర్ ఉద్యోగి నారాయణ రెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నారాయణది పరువు హత్యగా తేల్చారు పోలీసులు. మృతుడి మామే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నిర్థారించాడు. కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భరించని తండ్రి.. వీరిద్దరిని ఇంటికి పిలిపించాడు. తన అల్లుడైన నారాయణరెడ్డిని .. మామ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఘనంగా పెళ్లి చేస్తానంటూ.. ఢిల్లీలో ఉన్న కుమార్తె, అల్లుడిని ఇంటికి పిలిపించి కుమార్తెను గృహనిర్భందించి, వేరే…
నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఓ ప్రకటనను విడుదల చేశారు. నేడు అమ్మవారి కల్యాణం, రేపు (బుధవారం) రథోత్సవం సందర్భంగా ఆయా రోజుల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకుని ప్రయాణించాలని ఆయన కోరారు. read also: Kaali Poster: కాళీ పోస్టర్పై వివాదం.. నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. ట్రాపిక్ ఆంక్షలు : గ్రీన్ల్యాండ్స్, దుర్గామాత…
రాష్ట్రవ్యాప్తంగా.. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే.. ఉత్తర ఒడిశా.. దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఝార్ఖండ్.. పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. అనంతరం అది వాయవ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్గఢ్ తీరంలో కేంద్రీకృతమై.. స్థిరంగా కొనసాగుతుండడంతో రాష్ట్రంలో…