హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.. ఇక, ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈరోజు ఉదయం 8.30 గంటల వరకు వాతావరణ విశ్లేషణ ప్రకారం.. తెలంగాణలో రాగల మూడు రోజుల వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు.. నిన్నటి ఉపరితల ఆవర్తనం…
కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కాము అనుకున్న చాలామంది కోవిడ్ బాధితులను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది.. దీంతో, కరోనా బారిన పడినవారు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. అయినా, క్రమంగా దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే, బ్లాక్ ఫంగస్ ముప్పు ఎవరిలో ఎక్కువగా ఉంటుందనే విషయంపై ఓ అధ్యయనం నిర్వహించింది హైదరాబాద్ సెంట్రల్…
ఓ సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు వనస్థలిపురం పోలీసులు. తన భర్తపై దాడి చేసి.. తనను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారేడ్పల్లి సీఐపై వనస్థలిపురం పీఎస్లో కేసు నమోదు చేశారు.. బాధిత మహిళ భర్తపై దాడికి పాల్పడిన సీఐ.. ఆ తర్వాత నగర శివారులోని ఓ లాడ్జికి బలవంతంగా ఆ మహిళను తీసుకెళ్లాడు.. ఆపై అమెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.. ఇక,…
ఈ నెల 12వ తేదీన హైదరాబాద్కు రానున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్కు రానున్న ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి
తన కూతురికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని అల్లాడిపోయింది ఓ తల్లి.. ఉండేది అద్దె కొంపలో.. రెక్క ఆడితేగానీ డొక్కాడని పరిస్థితి.. ఈ సమయంలో తనకు పుట్టిన బిడ్డకు బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది.. అప్పటికే అప్పులు చేసి దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు ఆ పేద దంపతులు.. అయినా, ఆ చిన్నారికి నయం కాలేదు.. దానికి తోడు ఆ చిన్నారికి చికిత్సచేయించలేని తన ఆర్థిక పరిస్థతి ఆమెను వెక్కరించింది.. దీంతో, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన…
హైదరాబాద్ సహా 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈ సీజన్లో హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ చేయడం ఇదే తొలిసారి.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
ఈ సీజన్లో తొలిసారి హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. సిటీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. తెలంగాణలోని 14 జిల్లాల్లో శనివారం అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్లో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 3 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ.. ఇక, తెలంగాణకు రెడ్ అలెర్ట్తో పాటు గ్రీన్, ఆరెంజ్, ఎల్లో…
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు. ప్రతి విషయాన్ని షేర్ చేసి అందరితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన సమస్యల గురించి చెప్పినా వెంటనే స్పందిస్తారు కేటీఆర్. అయితే ఇటువంటి ఘటనే ట్వీటర్ వేదికగా స్పందించారు కేటీఆర్. హైదరాబాద్లోని స్వర్ణపురి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కేటీఆర్కు ట్వీట్ చేశారు. వారందరూ నివసిస్తున్న ప్రాంతంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, తక్షణమే స్పందించి వైద్య సేవలు అందించాలని కోరుతూ సుబ్రహ్మణ్యం కేటీఆర్కు ట్విట్టర్లో విన్నవించారు.…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదం చిక్కుకున్నారు.. ఆయన హైదరాబాద్ శివారులో కోడిపందాల్లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగర శివార్లలో కోడిపందాల దగ్గరకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్.. పోలీసులు రాగానే చల్లగా జారుకున్నారు. అయితే, కోడిపందాల్లో తాను లేనంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు.. కానీ, దీనికి ఓ వీడియోతో కౌంటర్ ఇచ్చారు పోలీసులు.. ఘటనా స్థలంలో చింతమనేని ప్రభాకర్ ఉన్న వీడియోను విడుదల చేశారు..…